అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో చమురు ధరలతో పాటు ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడుల వైపు దృష్టి సారించడంతో బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. తమ కమాండర్ ఖాసీమ్‌ను హతమార్చిన అమెరికాపై ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరిస్తే, అదే జరిగితే ఊరుకునేది లేదని అగ్రరాజ్యం చెబుతోంది. దీంతో చమురు ధర బ్యారెల్ 70 డాలర్లకు చేరుకుంది. అనిశ్చితుల కారణంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు పెట్టుబడులు మళ్లిస్తున్నారు.

1,579 డాలర్లకు పెరిగిన బంగారం
ముడి చమురు ప్రభావం కారణంగా డాలరుతో పోలిస్తే రూపాయి బలహీనపడుతోంది. సోమవారం ఓ దశలో డాలర్ విలువ 72.11కు చేరింది. చివరకు 71.93 వద్ద స్థిరపడింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలోను మార్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం ఒక్కరోజులోనే ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం అంతర్జాతీయ మార్కెట్లో 54 డాలర్లు పెరిగి 1,579 డాలర్లకు చేరుకుంది. భారత కరెన్సీలో ఇది రూ.1,13,688. 2013 తర్వాత ధర ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి.

రూ.42,000 చేరువలో...
అంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.36,550కి చేరుకుంది. మన దేశంలో కస్టమ్స్ సుంకం, జీఎస్టీ, ఇతర ట్యాక్స్ కలుపుకుంటే మరో 13.5 శాతం అవుతుంది. ఇలా చూస్తే బంగారం ధర రూ.42,000 కంటే పైకి చేరుకుంది. వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి 49,200 వద్ద ట్రేడ్ అయింది.

చివరలో తగ్గిన బంగారం ధర..
బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఓ దశలో రూ.42,200కు చేరుకున్నప్పటికీ చివరలో కాస్త తగ్గింది. ఔన్స్ బంగారం 1,579 నుంచి 1,564కు చేరుకుంది. దీంతో భారత్‌లో బంగారం ధర రూ.41,750కి తగ్గింది. వెండి కిలో రూ.48,500 వద్ద ట్రేడ్ అయింది. అయితే గత మూడు నాలుగు రోజులుగా మాత్రం బంగారం ధర రూ.2,000 నుంచి 3,000 మధ్య పెరిగింది. సోమవారం మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో

పెరుగుదలతో ఇబ్బందులు..
త్వరలో పెళ్లిళ్ళు జరగాల్సిన ఇళ్లలో, బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారు పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం చల్లారకుంటే బంగారం, వెండి, పల్లాడియం, చమురు ధరలు మరింత పెరిగే అవకాశముంది.

బంగారం మార్పిడి
ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గత ఏడాది చివరలో రూ.40,000కు పెరిగినప్పుడే డిమాండ్ తగ్గింది. ఇప్పుడు రూ.42,000కు చేరువలో ఉంది. దీంతో దేశీయంగా మరింత డిమాండ్ తగ్గే అవకాశముంది. చాలామంది పాత నగలు మార్చుకొని కొత్తవి తీసుకోవడం మంచిదని భావిస్తున్నారు. దీంతో స్వల్పంగా మాత్రమే భారం పడుతుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.



Click it and Unblock the Notifications