శుక్రవారం బంగారం ధర కాస్త తగ్గింది. అయితే మూడు రోజుల నుంచి పుత్తడి ధరల క్షీణత కనిపిస్తోది. గురు, శుక్రవారాల్లో పసిడి ధర ఏకంగా రూ.1300 వరకు తగ్గిందని చెబుతున్నారు. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.100 తగ్గింది. డిమాండ్ ఉన్నప్పటికీ బంగారం ధర తగ్గింది. ఆగస్టు 09న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.70,000కి చేరింది. 22 క్యారెట్ల బంగారం తులానికి రూ. 63,490 గా ఉంది.
హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.69, 250 గా ఉంది. ఇక 22 క్యారెట్ల తులం పుత్తడి రూ. 63,490గా ఉంది. విశాఖపట్నం, కరీంనగర్ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.69,250 గా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.63,490 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో తులం 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,410 ఉండా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.63,640గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,260 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 63,490గా ఉంది. కోల్ కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,260 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,490గా ఉంది. బెంగళూర్ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.69, 270 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.63,500గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,510 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,280గా ఉంది.
మార్కెట్ పరిస్థితులు మారుతున్నందున, పెట్టుబడిదారులు, వ్యాపారులు ఈ ధోరణులను నిశితంగా గమనిస్తారు. అభివృద్ధి చెందుతున్న ఈ కథనంపై మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి. ఇటీవల ప్రభుత్వం బంగారం, వెండితో సహా పలు ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ఇది కూడా బంగారం ధర తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. విలువైన లోహాలు, బంగారం, వెండి కడ్డీలు, బంగారం, వెండి కడ్డీలతో తయారు చేసిన నాణేలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం (BCD) 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. బంగారం, వెండి డోర్‌లపై డ్యూటీని 14.35 శాతం నుంచి 5.35 శాతానికి తగ్గించారు.


Click it and Unblock the Notifications