ఈ నెలలో బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్లలో పెట్టుబడిదారులకు అనుకూలంగా కొనసాగే అవకాశం కనిపిస్తున్నప్పటికీ..ఇన్వెస్టర్లు కొంత అస్థిరతను గమనించడానికి సిద్ధంగా ఉండాలి. ఆనంద్ రతి షేర్లు, స్టాక్ బ్రోకర్స్, కమోడిటీలు & కరెన్సీల AVP మనీష్ శర్మ తాజా మార్కెట్ పై అంచనాలను విడుదల చేశారు. ఈ అంచనాల్లో బంగారం, వెండి పెట్టుబడిదారుల కోసం కీలక సూచనలు షేర్ చేశారు.ఆయన అభిప్రాయం ప్రకారం బంగారం కన్నా వెండిని కొనడం ఉత్తమమని సూచిస్తున్నారు. భవిష్యత్తులో బంగారం కన్నా వెండి విలువైనదిగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
గత వారంలో బులియన్ మార్కెట్లు బలమైన పెరుగుదలను నమోదు చేశాయి. ముఖ్యంగా వెండి ధరల్లో భారీ కదలికలు కనిపించాయి. ట్రాయ్ ఔన్స్‌కు 50 డాలర్ల కన్నా తక్కువ స్థాయి నుంచి వెండి ధర ఒక్కసారిగా 58.85 డాలర్ల వరకూ ఎగిసి పడింది. ఈ పెరుగుదల బంగారం కన్నా అధికంగా నమోదవడంతో, బంగారం-వెండి నిష్పత్తి ఏడాది కనిష్ట స్థాయి 73కు పడిపోయింది. ప్రపంచ మార్కెట్లలో తెల్లని లోహం సరఫరా తీవ్రంగా తగ్గిపోవడం దీని ప్రధాన కారణంగా పేర్కొనబడుతోంది.

చైనాలోని షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్‌లో వెండి నిల్వలు గత దశాబ్దంలోనే అత్యల్ప స్థాయికి చేరగా, షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్ నిల్వలు తొమ్మిది సంవత్సరాల కనిష్టానికి తగ్గాయి. అక్టోబర్ నెలలో చైనా సుమారు 660 టన్నుల వెండిని ఎగుమతి చేయడంతో.. లండన్ మార్కెట్‌లో కొరత ఏర్పడి Gold ధరలపై భారీ ఒత్తిడి పడింది. మరోవైపు.. బ్లూమ్‌బెర్గ్ ట్రాక్ చేసిన వెండి నిల్వలు గత వారం 290 టన్నుల భారీ ఇన్‌ఫ్లోలను చూపించాయి. ఇది అందుబాటులో ఉన్న లోహాన్నే మార్కెట్ నుంచి తీసేసి ధరల పెరుగుదలకు కారణమైంది.
బంగారం విషయానికి వస్తే.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం అక్టోబర్ నెలలో సెంట్రల్ బ్యాంకులు మొత్తం 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇది నెలతొ నెలగా 36 శాతం పెరుగుదలగా నమోదు అయింది. గ్లోబల్ డిమాండ్ స్థిరంగా పెరుగుతున్నదనే సంకేతాన్ని ఇస్తోంది. పోలాండ్ నేషనల్ బ్యాంక్ ఈ కొనుగోళ్లలో ముందంజలో ఉంది.
అమెరికాలో నవంబర్ నెలతోపాటు వరుసగా తొమ్మిదో నెల కూడా తయారీ రంగం కుంచించుకుపోయిందని తాజా డేటా చూపిస్తోంది. ఆర్థిక మందగమనం భయం మధ్య, పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు డిసెంబర్ 10న జరిగే ఫెడరల్ రిజర్వ్ సమావేశంపై కేంద్రీకృతమైంది. నవంబర్ ADP ఉద్యోగాల నివేదిక, ఆలస్యమైన సెప్టెంబర్ PCE ఇన్‌ఫ్లేషన్ డేటా బంగారం-వెండి ధరలను కీలకంగా ప్రభావితం చేయవచ్చు.
CME FedWatch సాధనం ప్రకారం డిసెంబర్‌లో వడ్డీ రేటు తగ్గింపుకు దాదాపు 87 శాతం అవకాశం ఉంది. అలాగే అమెరికా కొత్త ఫెడ్ చైర్మన్‌పై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటనను మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. ముందంజలో ఉన్నట్లు పేరు వినిపిస్తున్న వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ కూడా ట్రంప్ లాగే తక్కువ వడ్డీ రేట్లకు మద్దతుదారుడే కావడం బులియన్ మార్కెట్లకు బలాన్నిస్తోంది.
మరో అంశంగా డాలర్ బలహీనత కూడా బంగారం ధరలకు మద్దతు ఇస్తోంది. డాలర్ ఇండెక్స్ గత వారం 0.72 శాతం పడిపోయి 99.47 వద్ద స్థిరపడింది. ఇక అమెరికా వెండిపై సుంకం విధించే అవకాశాలు, కామెక్స్‌లో లిక్విడిటీ తగ్గుదల వంటి అంశాలు వెండి ధరలను ఇంకా అస్థిరంగా మార్చవచ్చు. డిసెంబర్ నెల మొత్తం చూస్తే.. బులియన్ మార్కెట్‌కు మొత్తం దిశ సానుకూలంగానే ఉన్నప్పటికీ, లాభాల బుకింగ్ కదలికల కారణంగా వెండి ధరల్లో ఎక్కువ మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పెట్టుబడిదారులు దీర్ఘకాల దృష్టితో క్రమంగా కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications