బంగారం ధర ఈ రేటు వద్దకు వస్తేనే కొనండి.. పసిడి కొనుగోలుపై కీలక సూచన చేస్తున్న ఆర్థిక నిపుణులు
ఈ వారం బంగారం ధరల విశ్లేషణను పరిశీలిస్తే.. మార్కెట్ ప్రస్తుతం ఒక కీలకమైన మలుపు వద్ద ఉన్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీ హెచ్చుతగ్గులకు లోనైన బంగారం ధరలు, ఇప్పుడు ఒక స్థిరమైన దిశ కోసం వేచి చూస్తున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషణ ప్రకారం.. ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లలో జరగబోయే కీలక పరిణామాలు బంగారం గమనాన్ని శాసించనున్నాయి. ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (Fed), బ్యాంక్ ఆఫ్ జపాన్ (BoJ), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) వంటి ప్రధాన బ్యాంకులు తీసుకోబోయే వడ్డీ రేట్ల నిర్ణయాల కోసం ఇన్వెస్టర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కమోడిటీ రీసెర్చ్ సీనియర్ అనలిస్ట్ మానవ్ మోడీ అభిప్రాయం ప్రకారం.. బంగారం ధరలు ప్రస్తుతం రూ. 158,000 నుండి రూ. 160,000 మధ్య ఉన్న ఎగువ సరఫరా జోన్ వద్ద ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీనిని విశ్లేషకులు ఒక 'విరామం'గా భావిస్తున్నారు తప్ప.. ధరలు పూర్తిగా పడిపోతాయని అనుకోవడం లేదు. మార్కెట్ పరిభాషలో చెప్పాలంటే, ఇది ఒక 'ఫ్లాగ్ లేదా ట్రయాంగిల్' నమూనాను పోలి ఉంది. అంటే, Gold ధరలు ఏదో ఒక వైపు బ్రేక్అవుట్ (Breakout) సాధిస్తే తప్ప, తదుపరి స్పష్టమైన దిశ వెల్లడి కాదు. ప్రస్తుతం ట్రేడింగ్ పరిమాణం (Volume) తగ్గడం కూడా మార్కెట్ ఏకీకరణ (Consolidation) దిశగా వెళ్తోందని సూచిస్తోంది.

ముఖ్యమైన మద్దతు, నిరోధక స్థాయిలను గమనిస్తే, ఈ వారానికి బంగారం ధరలకు రూ. 1,50,500 వద్ద తక్షణ మద్దతు లభిస్తోంది. ఒకవేళ ధరలు ఇంకా తగ్గితే రూ. 148,500 వద్ద బలమైన మద్దతు ఉంది. ఒకవేళ బంగారం ధర రూ. 1,48,500 కంటే దిగువకు పడిపోతే.. మార్కెట్ బేరిష్ (Bearish) ధోరణిలోకి వెళ్లి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ ధర వద్ద పెట్టుబడిదారులు Gold కొనుగోలు చేస్తే తరువాత లాభాలతో బయటపడే అవకాశం ఉంది.
మరోవైపు ధరలు పెరగడం ప్రారంభమైతే రూ. 1,55,500 వద్ద మొదటి నిరోధకతను ఎదుర్కొంటాయి. ఒకవేళ బంగారం ధర రూ. 1,58,000 స్థాయిని దాటి నిలకడగా కొనసాగితే, మళ్లీ బుల్లిష్ (Bullish) ధోరణి ప్రారంభమై కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. అప్పుడు ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేయడం బంద్ చేయాలని సూచిస్తున్నారు.
వీటికి తోడు, అమెరికా నుండి వెలువడనున్న వినియోగదారుల విశ్వాసం, జీడీపీ (GDP), ద్రవ్యోల్బణం, మన్నికైన వస్తువుల ఆర్డర్ల డేటా కూడా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వ్యవహారం, చమురు ధరల పెరుగుదల వంటివి కూడా ఇన్వెస్టర్లను సురక్షితమైన పెట్టుబడిగా ఉన్న బంగారం వైపు మళ్లించే అవకాశం ఉంది. మొత్తానికి, ఈ వారం వెలువడే ఆర్థిక గణాంకాలు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలే బంగారం 'పసిడి' కాంతిని నిర్ణయించనున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
