బంగారం ధరలు తగ్గడం కష్టమే.. సామాన్యులు ఆశలు వదిలేసుకోవాలంటున్న గోల్డ్‌మన్ సాక్స్.. కారణం ఏంటంటే..

అమెరికా బాండ్ దిగుబడులు పెరగడం, బలమైన అమెరికా ఆర్థిక గణాంకాల ప్రభావంతో పసిడి ధరలు తాత్కాలికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ.. ఈ విలువైన లోహానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకుల నుండి లభిస్తున్న అపారమైన డిమాండ్ బలమైన రక్షణగా నిలుస్తోందని ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ సాక్స్ స్పష్టం చేసింది.

స్వల్పకాలికంగా మార్కెట్‌లో కొంత ప్రతికూలత, ధ‌ర‌ల అస్థిరత కనిపించినప్పటికీ.. అధికారిక రంగం నుండి అందుతున్న నిరంతర మద్దతు కారణంగా బంగారం ధరల్లో భారీ లేదా సుదీర్ఘమైన పతనం సంభవించే అవకాశం లేదని బ్యాంక్ విశ్లేషించింది. భవిష్యత్తులో ధరలు భారీగా పెరగడమే కాని తగ్గడం అనేది జరగదని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేస్తోంది. సామాన్యులు బంగారం కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సి రావొచ్చని తెలిపింది.

Goldman Sachs Gold Price Forecast Gold Prices Central Bank Gold Buying Gold Market Gold Investment Gold Reserves Bullion Market Precious Metals Business News Goldman Sachs

సాధారణంగా అమెరికా వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్స్ పెరిగినప్పుడు Gold లాంటి వడ్డీ రాబడి లేని సాధనాలపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గి అమ్మకాల ఒత్తిడి పెరుగుతుంది. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితి గతంలో పెరిగిన రాబడుల కాలాలకు పూర్తి భిన్నంగా ఉందనేది నిపుణుల అభిప్రాయంగా చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరచుకోవడంలో భాగంగా పసిడిని విపరీతంగా పోగుచేసుకోవడమేనని చెప్పవచ్చు. మే నెలలోనే ప్రపంచ కేంద్ర బ్యాంకులు ఏకంగా 31 టన్నుల బంగారాన్ని తమ నిల్వలకు జోడించుకున్నాయి. ఇది దీర్ఘకాలిక నెలవారీ సగటు కొనుగోళ్ల కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం.

Also Read

ఈ రకమైన అధికారిక రంగ కొనుగోళ్లు బంగారం మార్కెట్‌కు ఒక గట్టి మద్దతును లేదా కనీస స్థాయిన అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs), స్పెక్యులేటివ్ పొజిషన్ల ద్వారా మార్కెట్‌లో వచ్చే తాత్కాలిక అమ్మకాల ప్రభావాన్ని కేంద్ర బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు సమర్థవంతంగా అడ్డుకోగలుగుతున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ భవిష్యత్ వడ్డీ రేట్ల అంచనాలు, పెరిగిన వాస్తవ వడ్డీ రేట్ల కారణంగా స్వల్పకాలికంగా బంగారం ధరలలో ఊగిసలాట కొనసాగినప్పటికీ.. అధిక రాబడుల వల్ల కలిగే ఏ బలహీనత అయినా కేవలం తాత్కాలికమేనని గోల్డ్‌మన్ సాచ్స్ నొక్కి చెప్పింది.

గత మూడేళ్లుగా కేంద్ర బ్యాంకులు చూపిస్తున్న స్థిరమైన డిమాండ్, పసిడి మార్కెట్ నిర్మాణాన్ని ప్రాథమికంగా మార్చివేసింది. పెట్టుబడిదారులకు ఇది ఒక రకమైన నష్టభయ రక్షణను (Downside Risk Protection) అందిస్తోంది. ద్రవ్యోల్బణ భయాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ప్రపంచ ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో కాగితపు కరెన్సీల కంటే బంగారం వైపే కేంద్ర బ్యాంకులు మొగ్గు చూపుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా వడ్డీ రేట్ల ఒత్తిడి స్వల్పకాలికంగా పసిడి ప్రయాణాన్ని కాస్త నెమ్మదింపజేసినప్పటికీ.. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల బలమైన కొనుగోళ్ల మద్దతు వల్ల బంగారం దీర్ఘకాలిక దృక్పథం ఎంతో పటిష్టంగా, ఆశాజనకంగానే ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+