గతేడాది కాలం నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంకా చెప్పాలంటే 2019 చివరినుంచి 2025 వరకు బంగారం ధర సుమారు 184 శాతం పెరిగిందని చెప్పవచ్చు. 2025లో 63 శాతం లాభం నమోదు చేసి పెట్టుబడిదారులకు లాభాల పంట పండించింది. సామాన్యులు బంగారం కొనాలంటే భయపడే పరిస్థితులు నెలకొనగా.. పెట్టుబడిదారులు మాత్రం భారీగా లాభాలను అందుకున్నారు. ఇక 2026 వచ్చేసింది.
ఈ ఏడాది కూడా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో బంగారం ధరల్లో విపరీతంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయం ప్రకారం.. 2026లో Gold ధరలు ఇంకా పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల విధానాలు, పెట్టుబడిదారుల ప్రవర్తన ఇవన్నీ కలిపి బంగారాన్ని పరుగులు పెట్టిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వాల్ స్ట్రీట్‌కు చెందిన ప్రముఖ సంస్థలు, ప్రపంచ బ్యాంకులు 2026 కోసం బంగారం ధరలపై బలమైన లక్ష్యాలను ప్రకటిస్తున్నాయి. కొందరు అనలిస్ట్‌లు Gold ఔన్సు ధర 5,000 డాలర్లు దాటే అవకాశాన్ని స్పష్టంగా ప్రస్తావిస్తున్నారు. మరికొందరు నిపుణులు ఇంకా ఎక్కువగా 6,000 డాలర్లకు పైగా చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల వెనుక ఉన్న ప్రధాన కారణం కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆసియా దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారకద్రవ్య నిల్వలను విభిన్నంగా మార్చుకునే వ్యూహంలో భాగంగా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది మార్కెట్‌లో స్థిరమైన డిమాండ్‌ను సృష్టిస్తోంది.
ఇంకొక ముఖ్య అంశం ఏమిటంటే సేఫ్-హావెన్ డిమాండ్. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు, యుద్ధాలు, వాణిజ్య ఘర్షణలు, రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తుల వైపు మళ్లిస్తున్నాయి. అటువంటి సమయంలో బంగారం విశ్వసనీయమైన పెట్టుబడిగా నిలుస్తుంది. దీతో పాటు ద్రవ్యోల్బణ భయాలు కూడా బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయి. కరెన్సీ విలువలు పడిపోతాయనే ఆందోళన ఉన్నప్పుడు.. బంగారం విలువను నిలబెట్టుకునే సాధనంగా పెట్టుబడిదారులు చూస్తున్నారు.
Jefferies Group బంగారం ధర 2026 నాటికి 6,600 డాలర్ల వరకు చేరవచ్చని అంచనా వేసింది. Yardeni Group 6,000 డాలర్లు, UBS 5,400 డాలర్ల లక్ష్యాలను సూచించగా, JPMorgan, Charles Schwab సుమారు 5,055 డాలర్లుగా అంచనా వేశాయి. ఇక Bank of America, ANZ Bank లు కూడా 5 వేల డాలర్ల ధర సాధ్యమని భావిస్తున్నాయి. ఇక కొంత జాగ్రత్తగా చూసే సంస్థలు Goldman Sachs 4,900 డాలర్లు అంచనా వేసింది. Deutsche Bank 4,950 డాలర్లుగా అంచనా వేసింది. Morgan Stanley, Standard Chartered 4,800 డాలర్ల లక్ష్యాలను వెల్లడించాయి. Wells Fargo మాత్రం 4,500 డాలర్ల నుంచి 4,700 డాలర్ల మధ్య పరిధిని సూచించింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు కూడా బంగారం భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి. వడ్డీ రేట్లు తగ్గే దిశగా వెళ్తే, బంగారం వంటి నాన్-ఇంటరెస్ట్ బేరింగ్ ఆస్తులకు డిమాండ్ పెరుగుతుంది. అదే విధంగా, డాలర్ బలహీనపడితే బంగారం ధరలకు మరింత ఊపొస్తుంది. ఈ రెండు అంశాలు 2026లో బంగారానికి అనుకూలంగా మారవచ్చని అనలిస్ట్‌లు భావిస్తున్నారు.
ఇక మరి కొందరు విశ్లేషకులు మార్కెట్‌లో అప్పుడప్పుడు సవరణలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు స్థిరపడితే లేదా జియోపాలిటికల్ టెన్షన్లు తగ్గితే.. బంగారంపై ఉన్న ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయినప్పటికీ, దీర్ఘకాలిక దృష్టిలో బంగారం పట్ల సానుకూల అభిప్రాయమే ఎక్కువగా కనిపిస్తోంది.
క్లుప్తంగా చూసుకున్నట్లయితే 2026లో బంగారం ధరలపై అనలిస్ట్‌ల అంచనాలు బలంగా ఉన్నాయి. సగటున 4,600 డాలర్ల నుంచి 5 వేల డాలర్లకు పైగా ఉండే అవకాశముందని అంచనా వేస్తుండగా, అత్యంత బుల్లిష్ అంచనాలు ఇంకా ఎక్కువ స్థాయిలను సూచిస్తున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, సేఫ్-హావెన్ డిమాండ్, వడ్డీ రేట్ల ధోరణి, ప్రపంచ అనిశ్చితి ఇవన్నీ కలిపి బంగారం ధరలను పేంచే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

బంగారం, వెండి కొనకపోయినా మీ జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. ధరలు పెరిగితే తడిసి మోపేడే మీకు..

ఇరాన్ దాడులు.. బంగారం ధరల పెరుగుదలపై బిగ్ న్యూస్.. దుబాయ్ నుంచి ఆగిపోయిన పసిడి సరఫరా..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు



Click it and Unblock the Notifications