Gold Prices: మరో వారంలో దేశంలో అక్షయ తృతీయ రాబోతోంది. ఇది పసిడి ప్రియులకు ఎంతగానో ఇష్టమైనది. దీనికోసం చాలా మంది ఏడాది పొడుగునా ఎదురుచూస్తుంటారు. ఇది వినియోగదారులకు ఎంత ఇష్టమైన పండుగో.. బంగారం వ్యాపారులకు సైతం అంతే ముఖ్యమైనది.
ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైం హైలో కొనసాగుతున్నాయి. తాజాగా బంగారం 10 గ్రాములకు రూ.760 తగ్గి రికార్డు సృష్టించింది. ఎందుకంటే ఈ ఏడాది ఇదే అత్యధిక ధర పతనం. కానీ గతంతో పోల్చుకుంటే బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పండుగ సమయానికి రూ.65 వేల మార్కును దాటిపోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్న తరుణంలో చాలా మంది ఇన్వెస్టర్లు తమ సొమ్మును పసిడిలో పెట్టుబడిగా పెట్టాలని చూస్తున్నారు.

నిపుణుల అంచనా ప్రకారం బంగారం అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల మరింతగా పెరుగుతుందని తెలుస్తోంది. అయితే దీనిని సొమ్ము చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ ధోరణి మార్కెట్లో స్వల్పకాలం మాత్రమే కొనసాగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరికొందరు పెట్టుబడి సలహాదారుల ప్రకారం బంగారం ఈక్విటీ మార్కెట్ల కంటే ఎక్కువ రాబడిని దీర్ఘకాలంలో అందించలేదని అంటున్నారు. ఈ క్రమంలో సేఫ్ హెవెన్ గోల్డ్ కొనుగోలులో గందరగోళానికి గురవుతున్నారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను గమనించినట్లయితే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాదులో రూ.55,940 ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,030గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.55,940 ఉండగా 24 క్యారెట్ల ధర రూ.61,030గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,500గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర మాత్రం రూ.61,640గా కొనసాగుతోంది. బెంగళూరులో గోల్డ్ 22 క్యారెట్ల ధర రూ.55,990 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.61,080గా ట్రేడవుతోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బంగారం ధరలను పరిశీలించనట్లయితే.. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.55,940 ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,030గా ఉంది. ఇదే క్రమంలో విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, అమరావతి నగరాల్లో సైతం పైన పేర్కొన్న ధరలే కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications