Gold News: దాదాపు రెండు వారాలుగా బులియన్ మార్కెట్లో ఎలాంటి చప్పుడు లేదు. రోజురోజుకూ గోల్డ్ ధర క్షీణిస్తూనే ఉంది. తాజాగా తగ్గిన ధరలతో పసిడి ధరలు ఐదు నెలల కనిష్ఠానికి దిగజారాయని వెల్లడైంది.
ప్రధానంగా అమెరికాలో ఆర్థిక పరిస్థితుల వల్ల వడ్డీ రేట్ల పెంపు ఉంటుందనే మూడ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. దీంతో బంగారం ధరలు చతికిలపడ్డాయి. యూరో జోన్ లోని దేశాలు సైతం ఒకదాని తర్వాత మరొకటి మాంద్యంలోకి జారుకోవటం పసిడి పరుగులకు బ్రేకులు వేసింది. డాలర్ స్థిరత్వం, ట్రెజరీ దిగుబడులు పెరగటం కూడా పసిడి మెరుపులను తగ్గిస్తున్నాయి.

ఈ క్రమంలో US గోల్డ్ ఫ్యూచర్స్ 0.7% తగ్గి జౌన్సుకు 1,915.20 డాలర్ల రేటు వద్ద స్థిరపడ్డాయి. దీనికి తోడు బాండ్ ఈల్డ్స్ పెరగటం.. US వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండవచ్చనే అంచనాలు పసిడి పెట్టుబడిదారులకు తక్కువ ఆకర్షణీయంగా మారింది. ఇది బంగారం ధరలను దెబ్బతీసింది. పైగా డాలర్ కూడా రెండు నెలల గరిష్ఠాన్ని తాకింది. నిరుద్యోగ ప్రయోజనాల కోసం కొత్త క్లెయిమ్‌లను దాఖలు చేసే అమెరికన్ల సంఖ్య గత వారం పడిపోయిందని డేటా చూపించింది, ఇది ఇప్పటికీ గట్టి లేబర్ మార్కెట్‌ను సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన పసిడి ధరలను గమనిస్తే నేడు స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, కడప, కాకినాడ, అనంతపురం, తిరుపతి, నెల్లూరుల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,100 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,020గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో సైతం ఇవే రేట్లకు విక్రయాలు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో వెండి ధరలను పరిశీలిస్తే రూ.1,000 పెరిగిన తర్వాత కేజీ రూ.76,700గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications