ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పసిడి ప్రియులకు తీపి కబురు అందింది. నేడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దింతో తులం ధర రూ.450 నుండి రూ.490 మేర తగ్గింది. అయితే ఈ వారంలో పసిడి ధరలు దిగిరావడం మంచి విహాయం అని చెప్పవచ్చు. అలాగే గోల్డ్ షాపింగ్ చేసే వారికీ కూడా సరైన సమయం. ఎందుకంటే కొంతకాలంగా హెచ్చుతగ్గులకు గురవుతున్న పసిడి ధరలు కొనుగోలుదారులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇందుకు కారణం ఆకాశాన్ని తాకుతున్న ధరలే. ప్రస్తుతం బంగారం ధరలు 10 గ్రాములకు లక్షకి చేరువలో దగ్గరవుతున్నాయి. ఇలాంటి సమయంలో రేట్లు దిగిరావడం అనేది సామాన్యులకు ఊరటనిచ్చే విషయం.

బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం కాగా, మరో వైపు అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల బంగారం, వెండి రేట్లు క్షీణిస్తోంది. మరోవైపు స్టాక్ మార్కెట్ భారీగా పడినట్లయితే బంగారం ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సర్కార్ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు కూడా బంగారం ధరను నిర్ణయిస్తాయని చెబుతున్నారు.
ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.45 పడిపోయి రూ.8,710, 24 క్యారెట్ల ధర రూ.49 తగ్గి రూ.9,502, 18 క్యారెట్ల ధర రూ.36 దిగొచ్చి రూ.7,127. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.87,100, నిన్నటి ధర రూ.87,550 అంటే రూ.450 తగ్గగా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.95,020, నిన్నటి ధర చూస్తే రూ.95,510 దింతో రూ.490 పడిపోయింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.71,270, నిన్నటి ధర రూ.71,630 అంటే రూ.360 తగ్గుదల నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే : వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్లకు రూ.95,020, 18 క్యారెట్లకు రూ.71,270. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్లకు రూ.95,020, 18 క్యారెట్లకు రూ.71,270. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్లకు రూ.95,020, 18 క్యారెట్లకు రూ.71,270. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్లకు రూ.95,020, 18 క్యారెట్లకు రూ.71,270.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే : విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్లకు రూ.95,020, 18 క్యారెట్లకు రూ.71,270. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్లకు రూ.95,020, 18 క్యారెట్లకు రూ.71,270. అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్లకు రూ.95,020, 18 క్యారెట్లకు రూ.71,270. గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్లకు రూ.95,020, 18 క్యారెట్లకు రూ.71,270. నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్లకు రూ.95,020, 18 క్యారెట్లకు రూ.71,270. కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్లకు రూ.95,020, 18 క్యారెట్లకు రూ.71,270. తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్లకు రూ.95,020, 18 క్యారెట్లకు రూ.71,270. కడపలో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్లకు రూ.95,020, 18 క్యారెట్లకు రూ.71,270. అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.87,100, 24 క్యారెట్లకు రూ.95,020, 18 క్యారెట్లకు రూ.71,270.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.98.10గా ఉండగా, 10 గ్రాములకి రూ.981, కేజీకి నేడు రూ.98,100 అంటే ఇవాళ వెండి ధర రూ.100 పెరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.98,100, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,09,100.
అయితే గత కొంతకాలంగా అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం, అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల విధింపు వంటి అంతర్జాతీయ కారణాల వల్ల బంగారం ధరలు పెరగడంతో డిమాండ్ కాస్త తగ్గింది. ముఖ్యంగా డాలర్ బలహీనపడటం, టారిఫ్స్ గురించి ఆందోళనలు మళ్లీ ముందుకి రావడంతో అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ కాలం నాటి టారిఫ్‌లు మళ్లీ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌లో భయాందోళనలు రేకెత్తించాయి. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ పెరిగింది.
ఇక ఇండియాలో రాబోయే పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా దేశీయంగా కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉండటంతో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వైస్ ప్రెసిడెంట్ అక్షా కంబోజ్ అభిప్రాయపడ్డారు. దీని బట్టి చూస్తే సమీప భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో వీటి ధరలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. నిపుణుల అంచనా ప్రకారం వచ్చే దీపావళికి బంగారం తులం ధర 80 వేలకి దిగిరావొచ్చని భావిస్తున్నారు.
0210 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.4 శాతం తగ్గి $3,215.31 డాలర్ల వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం తగ్గి $3,218.40 డాలర్ల వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.3 శాతం తగ్గి $32.25 డాలర్ల వద్ద, ప్లాటినం 0.3 శాతం పెరిగి $1,000.71 డాలర్ల వద్ద, పల్లాడియం 0.1 శాతం తగ్గి $973.74 డాలర్లకి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ప్రభుత్వ పన్నులు మరియు రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వంటి చాల కారణాల వల్ల భారతదేశంలో బంగారం ధర మారుతూ ఉంటుంది. మన సంప్రదాయాలు, పండుగల సమయంలో కూడా బంగారం ఒక ముఖ్యమైన భాగం. ముఖ్యంగా వివాహాలు, పండుగల సమయంలో దీని డిమాండ్ పెరుగుతుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

Gold: దుబాయ్‌లో డిస్కౌంట్‌కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!



Click it and Unblock the Notifications