దిగొస్తున్న బంగారం, వెండి.. 6 వేలు తగ్గిన ధర.. అక్షయ తృతీయకు కస్టమర్లకు పండగే..

బంగారం వెండి ధరలు దిగొస్తున్నాయి. గత వారం నుండి పసిడి రేట్లు తగ్గు ముఖం పట్టడంతో కస్టమర్లు షాపింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు, అయితే నేడు తులం ధర రూ.620 పైగా పడిపోగా, వెండి కూడా తగ్గుదల నమోదు చేసింది. దింతో అక్షయ తృతియకి ముందు పసిడి రేట్లు కుప్పకూలాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో కొనుగోలుదారులు ఇదే ఛాన్స్'గా భావించి భారీగా కొనేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు గత వారం రోజులుగా చూస్తే బంగారం ధర దాదాపు రూ. 1000 పైగా తగ్గింది. మరోవైపు వెండి ధర కూడా ఇవాళ ఒక్కరోజే రూ.1400 తగ్గింది.

Gold price dips rs 620 for 10grams silver down by 1400per kg in telangana and andhrapradesh on april 26

మరికొద్దీ రోజుల్లో మన దేశంలో అక్షయ తృతీయ పండుగను రానుంది. ఈ రోజున బంగారం లేదా ఇతర విలువైన లోహాలను కొనడం శుభప్రదంగా భావిస్తారు. అయితే బంగారం ధర ఇప్పటికీ రికార్డ్ స్థాయిలో ఉన్నప్పటికీ గత వారం నుండి తగ్గుతు వస్తుంది. ఇక అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం భారతదేశంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. అలాగే సంతోషం ఇంకా అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అక్షయ తృతీయ ఏప్రిల్ 30న కావడం గమనార్హం. బంగారం ధరలు తగ్గుతున్న తీరుపై నిపుణులు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరల తగ్గుదల ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఇటీవలి సంఘటనలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తే రాబోయే కొన్ని నెలల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని, ఇదే ట్రెండ్ కొనసాగితే బంగారం ధర రూ.56,000కి చేరుకోవచ్చని చాలా మంది బంగారు మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.62 తగ్గి రూ.8,940, 24 క్యారెట్ల ధర రూ.68 పడిపోయి రూ.9,753, 18 క్యారెట్ల ధర రూ.51 దిగొచ్చి రూ.7,315. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.89,400, నిన్నటి ధర రూ.90,020 అంటే రూ.620 తగ్గింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.97,530, నిన్నటి ధర చూస్తే రూ.98,210 దింతో రూ.680 తగ్గింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.73,150, నిన్నటి ధర రూ.73,660 అంటే రూ.510తగ్గింపును నమోదు చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150. ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150.

ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150.
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150.
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150.
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150.
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150.
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150.
కడపలో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150.
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.89,400, 24 క్యారెట్లకు రూ.97,530, 18 క్యారెట్లకు రూ.73,150.

మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.100.50గా ఉండగా, 10 గ్రాములకి రూ.1005, కేజీకి నేడు రూ.1,00,500 అంటే ఇవాళ వెండి ధర రూ.1400 తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,00,500, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,11,000.

అమెరికా అండ్ చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం పెట్టుబడిదారులకు కొంత రిలీఫ్ కలిగించడంతో ఇవాళ సోమవారం అమెరికా బంగారం ధరలు తగ్గాయి. 0016 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.3 శాతం తగ్గి $3,309.31కి చేరుకుంది. ఇతర లోహాలలో స్పాట్ వెండి ఔన్సుకు 0.6 శాతం తగ్గి $32.87 డాలర్లకి, ప్లాటినం 0.1 శాతం తగ్గి $970.80 డాలర్లకి, పల్లాడియం 0.6 శాతం తగ్గి $942.71 డాలర్లకి చేరుకుంది.

బంగారం కొనేటప్పుడు స్వచ్ఛతను ఈ విధంగా చెక్ చేయండి: ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, తయారీ ఛార్జీల కారణంగా దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల ధర మారుతూ ఉంటుంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు, అయితే కొంతమంది 18 క్యారెట్ల బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు. క్యారెట్ ప్రకారం ఆభరణాలపై హాల్ మార్క్ గుర్తు ఉంటుంది. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875 అని, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది.

ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతిరోజూ బంగారం, వెండి ధరల గురించి సమాచారం ఇస్తుంటుంది. పన్నులు ఇంకా ఇతర ఛార్జీలు లేకుండా ఈ బంగారం, వెండి రేట్లు ఉంటాయి. IBJA జారీ చేసే రేట్లు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటాయి. మీరు బంగారం లేదా వెండిని కొనుగోలు చేసినా లేదా తయారు చేసినా తయారీ ఛార్జీలపై విడిగా GST సహా తయారీ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+