నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బంగారం ప్రియులకు నిజంగా షాకింగ్ న్యూస్! నిన్న మొన్నటి వరకు స్థిరంగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దింతో 6 మే 2025న ఒక్కరోజే 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 2,500 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు రూ. 90,250కి చేరింది. ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర మరింతగా పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 2,730 ఎగబాకి రూ. 98,460 వద్ద చేరింది.

మరోవైపు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా పిడుగులాంటి వార్త. ఇంత భారీగా ధర పెరగడంతో గోల్డ్ షాపింగ్ చేసే వాళ్ళు ఒక విధంగా ఆందోళను గురవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువలో మార్పులు వంటి కారణాల వల్ల దేశీయంగా బంగారం ధరలు పెరుగుతుంటాయి. అయితే ఒక్కరోజే 2 వేలకి పైగా భారీగా పెరగడం సామాన్యులకి చుక్కలు చూపిస్తుంది.
మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త ఊరటనిచ్చాయి. కిలో వెండి ధర రూ. 100 మేర తగ్గింది. నిన్నటి వరకు అధిక స్థాయిలో ఉన్న వెండి ధర కాస్త దిగిరావడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే బంగారం ధరలు మళ్లీ ఎప్పుడు తగ్గు ముఖం పడతాయో వేచి చూడాల్సిందే.
అయితే బంగారం, వెండి ధరల్లో ఇలాంటి హెచ్చుతగ్గులు సహజం. మన దేశంలో ప్రతిరోజు ఉదయం బంగారం ధరలను సమీక్షించి కొత్త ధరలు జారీ చేస్తుంటారు. అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయ డిమాండ్ వంటి చాల అంశాలు వీటి ధరలను ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది. ప్రస్తుతానికైతే బంగారం కొనాలనుకునే వారికి కొంత సమయం వేచి ఉండాలని నిపుణులు సలహా చేస్తున్నారు. ధరలు తగ్గే వరకు వేచి చూడటం లేదా మీ బడ్జెట్‌కు అనుగుణంగా కొనుగోలు చేయడం ఉత్తమం. గత నెలలో బంగారం ధర లక్ష రూపాయలు దాటిన సంగతి మీకు తెలిసిందే. అయితే బంగారం ధర లక్ష దాటడం ఇదే తొలిసారి. అయితే తరువాత ధర మళ్లీ లక్షలోకి పడిపోయింది. గత నెలలో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత కారణంగా పెట్టుబడిదారులలో భయాందోళనలు బంగారం ధరల పెరుగుదలకు కారణం అని చెప్పవచ్చు. అంతేకాదు అక్షయ తృతీయ, వివాహాల సీజన్ ప్రారంభం కూడా బంగారం కొనుగోళ్ల డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలు.
ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.250 పెరిగి రూ.9,025, 24 క్యారెట్ల ధర రూ.273 పెరిగి రూ.9,846, 18 క్యారెట్ల ధర రూ.204 పెరిగి రూ.7,384. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.90,250, నిన్నటి ధర రూ.87,750 అంటే రూ.2500 పెరగ్గా, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.98,460, నిన్నటి ధర చూస్తే రూ.95,730 దింతో రూ.2730 పెరిగింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.73,840, నిన్నటి ధర రూ.71,800 అంటే రూ.2040 పెంపును నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే :
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.90,250, 24 క్యారెట్లకు రూ.98,460, 18 క్యారెట్లకు రూ.73,840.
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.90,250, 24 క్యారెట్లకు రూ.98,460, 18 క్యారెట్లకు రూ.73,840.
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.90,250, 24 క్యారెట్లకు రూ.98,460, 18 క్యారెట్లకు రూ.73,840.
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.90,250, 24 క్యారెట్లకు రూ.98,460, 18 క్యారెట్లకు రూ.73,840.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు:
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.90,250, 24 క్యారెట్లకు రూ.98,460, 18 క్యారెట్లకు రూ.73,840.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.90,250, 24 క్యారెట్లకు రూ.98,460, 18 క్యారెట్లకు రూ.73,840.
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.90,250, 24 క్యారెట్లకు రూ.98,460, 18 క్యారెట్లకు రూ.73,840.
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.90,250, 24 క్యారెట్లకు రూ.98,460, 18 క్యారెట్లకు రూ.73,840.
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.90,250, 24 క్యారెట్లకు రూ.98,460, 18 క్యారెట్లకు రూ.73,840.
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.90,250, 24 క్యారెట్లకు రూ.98,460, 18 క్యారెట్లకు రూ.73,840.
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.90,250, 24 క్యారెట్లకు రూ.98,460, 18 క్యారెట్లకు రూ.73,840.
కడపలో 22 క్యారెట్ల ధర రూ.90,250, 24 క్యారెట్లకు రూ.98,460, 18 క్యారెట్లకు రూ.73,840.
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.90,250, 24 క్యారెట్లకు రూ.98,460, 18 క్యారెట్లకు రూ.73,840.
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.96.90గా ఉండగా, 10 గ్రాములకి రూ.969, కేజీకి నేడు రూ.96,900 అంటే ఇవాళ వెండి రూ.100 తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.96,900, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,07,900.
స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 0.1 శాతం పెరిగి $3,337.69కి చేరుకుని ఏప్రిల్ 29 తర్వాత అత్యధిక స్థాయిని తాకగా తరువాత వెనక్కి తగ్గి 0018 GMT నాటికి $3,330.16 వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి $3,338.30కి చేరుకుంది. ఇతర లోహాలలో చూస్తే స్పాట్ సిల్వర్ 0.1 శాతం పెరిగి ఔన్సుకు $32.53కి చేరుకుంది, ప్లాటినం $959.30 వద్ద స్థిరంగా ఉంది అండ్ పల్లాడియం $940.50 వద్ద మారలేదు.
విదేశాల్లో నిర్మించే సినిమాలపై 100 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించడంతో ప్రపంచ వాణిజ్య యుద్ధం వల్ల కలిగే పరిణామాల గురించి ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. అంతేకాదు రాబోయే వారాల్లో ఔషధాలపై మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉంది. ఈ పరిణామాలు అన్ని కూడా అమెరికా వాణిజ్య విధానం, ప్రపంచ మార్కెట్ స్థిరత్వంపై కొత్త భయాలు రేకెత్తించాయి.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

Gold price: ఆల్ టైమ్ హై కంటే తక్కువకే బంగారం, వెండి.. కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold rates: బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు! తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications