ఈరోజు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయి. పెట్టుబడిదారుల దృష్టి మళ్లీ బంగారం పైకి మళ్లడంతో కొత్త రికార్డు ధరలు నమోదు అవుతున్నాయి. Gold ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించి భారీ పెరుగుదల నమోదు చేసింది. అదే సమయంలో వెండి ధర గత 14 సంవత్సరాల గరిష్ఠ స్థాయిని చేరుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. COMEX మార్కెట్‌లో బంగారం ధర 1.54 శాతం పెరిగి ఔన్సుకు 3570.40 డాలర్ల వద్దకు చేరింది. ఇదే సమయంలో వెండి ధర 2.84 శాతం పెరిగి ఔన్సుకు 41.34 డాలర్ వద్ద ట్రేడవుతోంది. ఈ పెరుగుదలతో పెట్టుబడిదారులు బంగారం, వెండి వైపు మళ్లి చూస్తున్నారు.
ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశమేనని చెప్పుకోవచ్చు. ఇటీవల ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్.. సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాన్ని సూచించారు. దీనికి తోడు ఈ వారం వెలువడనున్న అమెరికా ఉద్యోగాల నివేదిక కార్మిక మార్కెట్లో బలహీనతను చూపవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ అంశాలతో పెట్టుబడిదారులు వడ్డీ తగ్గింపుపై మరింత నమ్మకాన్ని పెట్టుకున్నారు.బంగారం, వెండి వంటి విలువైన లోహాలు వడ్డీ ఆదాయం ఇవ్వకపోయినా, వడ్డీ రేట్లు పడిపోతే పెట్టుబడిదారులకు అవి సురక్షితమైన డిమాండ్ గా మారుతాయి. అందుకే ఈ సందర్భంలో Gold డిమాండ్ మరింత పెరిగింది.

ఏప్రిల్ నుండి గోల్డ్ ETFలలో పెట్టుబడిదారుల వాటా కూడా గణనీయంగా పెరిగింది. బిఎంఓ క్యాపిటల్ మార్కెట్స్ విశ్లేషకుల ప్రకారం.. ఇది బంగారం ధరల పెరుగుదలకు మరొక ప్రధాన కారణంగా చెబుతున్నారు. పెట్టుబడిదారులు ఆర్థిక అనిశ్చితిలో సురక్షితమైన ఎంపికగా బంగారం, వెండిని చూస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి, వాణిజ్యంపై బెదిరింపులు కూడా ఈ లోహాలను సేఫ్ హేవన్ పెట్టుబడి కింద మార్చాయి. వీటికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడరల్ రిజర్వ్ మధ్య కొనసాగుతున్న విభేదాలు కూడా పెట్టుబడిదారుల ఆందోళనను పెంచి.. బంగారం-వెండి డిమాండ్‌ను మరింతగా పెంచాయి.
ఈ సంవత్సరం వెండి ధరలు 40 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. ఇది బంగారం కంటే మెరుగైన పనితీరును చూపుతున్నట్లు ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం వెండిని కేవలం పెట్టుబడిలోనే కాకుండా పారిశ్రామిక రంగాలలో కూడా వాడటమే. సిల్వర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. గత ఐదేళ్లుగా వెండి డిమాండ్ సరఫరా కంటే ఎక్కువగా కొనసాగుతోంది. వీటితో పాటుగా ఇతర విలువైన లోహాల ధరలు కూడా పెరిగాయి. రాగి 0.15 శాతం పెరిగి 4.547 డాలర్లు, ప్లాటినం 4.27 శాతం పెరిగి 1429 డాలర్లు, పల్లాడియం 3.02 శాతం పెరిగి 1158 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?

బంగారం ధరల పెరుగుదలపై లేటెస్ట్ రిపోర్ట్.. సరికొత్త నివేదికను విడుదల చేసిన ప్రముఖ బ్యాంకులు

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications