ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లు కుదేలైనప్పుడు పెట్టుబడిదారు తమ పెట్టుబడులను కాపాడుకోవడానికి సురక్షితమైన మార్గాలను వెతుక్కోవడం స్టాక్ మార్కెట్లో సహజంగా కనిపిస్తుంది. ఈ సురక్షితమైన మార్గంలో ప్రధానంగా ముందు వరసలో ఉండేది బంగారం అని చెప్పుకోవచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా బంగారం పెట్టుబడిదారులకు సురక్షితమైన ఆస్తిగా కొనసాగుతూ వస్తోంది. మార్కెట్లు పడిన ప్రతీసారి బంగారమే పెట్టుబడిదారులకు లాభాలను అందిస్తోంది.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి.ఈ నేపథ్యంలోనే సంచలన నివేదిక బయటకు వచ్చింది. దాని ప్రకారం చూసుకున్నట్లయితే 2030 నాటికి బంగారం ధర ఔన్సుకు 8,900 డాలర్లకు చేరే అవకాశం ఉంది. లీచ్టెన్‌స్టెయిన్‌కు చెందిన ఇంక్రిమెంటమ్ అనే ఆర్థిక పరిశోధనా సంస్థ Gold మీద ఒక విశ్లేషణ విడుదల చేసింది. ఈ విశ్లేషణ.. భవిష్యత్తులో బంగారం ధరలు గణనీయంగా పెరగొచ్చని తెలిపింది. 2029 నాటికి ఔన్సుకు 6,000 డాలర్లు దాటవచ్చని..అది 2030 నాటికి 8,900 డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది ప్రస్తుత ధరలతో పోలిస్తే సుమారు 80 శాతం పెరుగుదలగా చెప్పుకోవచ్చు

దీనికి ప్రధాన కారణాలు ఆ విశ్లేషణ ఏం చెబుతుందంటే.. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మళ్లీ వేగాన్ని అందుకుంటోందని తెలిపింది. అయితే కరెన్సీ విలువ తగ్గినప్పుడు, పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకోవడానికి బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు. చరిత్ర ప్రకారం చూసినట్లయితే ద్రవ్యోల్బణ కాలాల్లోనే బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇంక్రిమెంటమ్ నివేదిక ఇదే విషయాన్ని తెలిపింది. రాబోయే ఐదు సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం పెరిగితే బంగారం 8,900 డాలర్లకు చేరే అవకాశం ఉందని తెలిపింది.
మరో అంశం ఏంటంటే.. గత కొన్నేళ్లుగా ప్రపంచంలోని అనేక కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకుంటూ పోతున్నాయి. ముఖ్యంగా ఆసియాతో పాటుగా మధ్యప్రాచ్య దేశాలన్నీ డాలర్‌పై ఆధార పడటం తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే బంగారాన్ని ఎక్కువగా నిల్వ చేసుకుంటున్నాయి. దీనికి అభివృద్ధి చెందిన దేశాల్లో తక్కువ వడ్డీ రేట్లతో పాటుగా పరిమాణాత్మక సడలింపులు బంగారం ధరలకు మరింత ఊతం ఇస్తున్నాయి. ఈ విధానాలు ముందు ముందు కొనసాగితే బంగారం పెరుగుదల భవిష్యత్తులో స్పష్టంగా ఉంటుంది.
గ్లోబల్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం వంటి అంశాలన్నీ పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తుల వైపు మళ్లిస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో అస్థిరత పెరిగేకొద్దీ.. Gold సురక్షితమైన ఆస్తిగా కనపడుతోంది. ఇక అనిశ్చితి కాలాల్లో పెట్టుబడిదారుల సంపదను కాపాడేది బంగారమే. అయితే ప్రస్తుతం స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్‌లోనే పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి. బంగారంలో పెట్టుబడులు పెరిగితే డిమాండ్ తో పాటుగా ధరలు కూడా వేగంగా పెరిగే అవకాశం ఉంది.
ఏది ఏమైనా 2030 నాటికి బంగారం ఔన్సుకు 8,900 డాలర్లకు చేరుతుందా లేదా అన్నది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేము. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల కొనుగోలు విధానాలు, ప్రపంచ రాజకీయ అనిశ్చితిని బట్టి చూస్తే ఇది నిజమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications