పసిడి ప్రియులకు ఊరట.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొత్త రేట్లు ఇవే..

బంగారం ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు ఇవ్వాళా ఒక్కసారిగా కాస్త చల్లబడ్డాయి. అయితే బంగారం ధరలు ఇంతలా పెరగడానికి తగ్గడానికి చాల కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయినప్పటికీ ప్రస్తుతం పసిడి ధరలు రికార్డ్ స్థాయిలోనే ఉన్నాయి. అంతేకాక లక్షకి చేరువలో ఉండటం గమనార్హం. గతంలో చూస్తే బంగారం ధర ఒకానొక సందర్భంలో తులం ధర లక్ష దాటి అందరిని ఆశ్చర్యపరుస్తూ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. మరోవైపు వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పులు లేకుండా ఇవాళ స్థిరంగా ఉంది. కానీ వెండి ధర కేజీకి లక్షకి పైగానే ఉంది.

Gold price at rs97 480 per 10 grams silver stable at rs 1 00 000 kg in telangana and ap on may 28

సాధారణంగా మన దేశంలో ఏ పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లు జరిగిన బంగారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇంకా మహిళలు ఇలాంటి సమయంలో బంగారం కొనేందుకు ఇష్టపడుతుంటారు. బంగారం ఒక అలంకరణ మాత్రమే కాదు దానికో సంప్రదాయ చరిత్ర ఉంది. ముఖ్యం ప్రతి ఇంట్లో పెళ్లిళ్ల సమయంలో పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేస్తుంటారు. అలాగే బంగారు ఆభరణాలను ధరించడానికి పురుషులు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో బంగారం పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరస్పర సుంకాల చర్యల వల్ల ఏర్పడిన ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారంలో పెట్టుబడులు పెరిగాయి. బంగారం ధరలు పెరగడానికి ఇది అత్యంత ముఖ్యమైన కారణాలలో ఒకటిగా పరిగణించవచ్చు. కానీ తర్వాత బంగారం ధర స్వల్పంగా తగ్గి కస్టమర్లకు కాస్త ఉపశమనం కలిగించింది. అయితే, బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంది.

ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.8,935, 24 క్యారెట్ల ధర రూ.9,748, 18 క్యారెట్ల ధర రూ.7,311. దింతో 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ.89,350, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.97,480,10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.73,110.

దేశంలోని మెట్రో నగరాల్లో చూస్తే :
ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.89,500, 24 క్యారెట్లకు రూ.97,630, 18 క్యారెట్లకు రూ.73,230.
ముంబై 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,110.
కోల్కత్త 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,110.
చెన్నై 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,600.

తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే :
వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,110.
కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,110.
ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,110.
హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,110.

ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి ధరలు చూస్తే :
విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,110.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,110.
అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,110.
గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,110.
నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,110.
కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,110.
తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,110.
కడపలో 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,110.
అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.89,350, 24 క్యారెట్లకు రూ.97,480, 18 క్యారెట్లకు రూ.73,110.

మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాముకి రూ.100గా ఉండగా, 10 గ్రాములకి రూ.1000, కేజీకి నేడు రూ.1,00,000 అంటే ఇవాళ వెండి ధర స్థిరంగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.1,00,000, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,11,000.

అమెరికా దిగుమతి సుంకాల నుండి విలువైన లోహాలను మినహాయించిన తర్వాత ఏప్రిల్‌లో అమెరికా నుండి స్విట్జర్లాండ్‌కు బంగారం దిగుమతులు 2012 తర్వాత గరిష్ట స్థాయికి పెరిగాయని స్విస్ కస్టమ్స్ డేటా మంగళవారం చూపించింది. రూపాయి విలువ
చూస్తే బుధవారం రూపాయి విలువ 23 పైసలు తగ్గింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ. 85.63గా ఉంది. అలాగే నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 164 పాయింట్ల నష్టంతో 81,386 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 24,809 వద్ద ట్రేడవుతోంది.

0040 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.5 శాతం పెరిగి $3,314.19 డాలర్ల వద్ద ఉండగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి $3,313.20 డాలర్లకి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 0.1 శాతం తగ్గి 33.27 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.6 శాతం పెరిగి 1,085.97 డాలర్లకు చేరుకుంది అలాగే పల్లాడియం 0.1 శాతం తగ్గి 977.09 డాలర్ల వద్ద ఉంది.బంగారం కొనేటప్పుడు స్వచ్ఛత పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. భారతదేశంలో బంగారం స్వచ్ఛతను గుర్తుంచడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) హాల్‌మార్క్ గుర్తులను ఉపయోగిస్తారు. ఈ గుర్తులు బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో ఇంకా వాటికి సంబంధించిన నంబర్ల రూపంలో తెలియజేస్తాయి.

క్యారెట్లు, స్వచ్ఛత శాతం: 24 క్యారెట్ 99.9% స్వచ్ఛమైన బంగారం. కాబట్టి, ఆభరణాల తయారీకి అనుకూలంగా ఉండదు. 24K బంగారాన్ని సాధారణంగా బిస్కెట్లు, కాయిన్స్ లేదా బార్ల రూపంలో ఉంటాయి. 22 క్యారెట్లో 91.6% బంగారం ఉంటుంది. మిగిలిన 8.4% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలుపుతారు. ఆభరణాలు గట్టిగా ఉండటానికి ఈ లోహాలను కలుపుతారు. సాధారణంగా మనం కొనే చాలా ఆభరణాలు 22 క్యారెట్ల బంగారంతోనే తయారు చేస్తారు. 18 క్యారెట్లలో 75% బంగారం మాత్రమే ఉంటుంది. మిగిలిన 25% ఇతర లోహాలు ఉంటాయి.

note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+