ఈ క్వార్టర్‌లో భారీగానే షాకిచ్చిన బంగారం ధర, ఫ్యూచర్ తగ్గుదల
బంగారం ధరల్లో ఊగిసలాట కొనసాగుతోంది. సోమవారం ముంబై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.201 పెరిగి రూ.43,876 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.40,190 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.43,876 వద్ద, 18 క్యారెట్ల బంగారం రూ.32,907గా ఉంది. వీటికి 3 శాతం జీఎస్టీ అదనం. వెండి ధర కిలోకు రూ.2,100 పడిపోయి రూ.39,500 వద్ద ఉంది.

క్వార్టర్‌లో 6.5 శాతం పెరుగుదల.. వరుసగా ఆరోసారి
మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ 0.3 శాతం తగ్గి ఔన్స్‌కు 1,616.34 వద్ద, గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.1 శాతం తగ్గి 1,641.20 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధర ఈ క్వార్టర్‌లో మొత్తంగా 6.5 శాతం పెరిగింది. వరుసగా ఆరో త్రైమాసికంలోను ధర పెరిగింది.

రాబోయే రెండు మూడేళ్లలో రికార్డ్ స్థాయిలో..
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. రాబోవు రెండు మూడేళ్లలో డాలర్ టర్మ్స్‌లో పసిడి ధరలు ఈ రికార్డ్ స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.

పల్లాడియం, ప్లాటినమ్..
మిగతా అతి ఖరీదైన మెటల్స్ విషయానికి వస్తే పల్లాడియం 1 శాతం పెరిగి ఔన్స్ 2,349.90 డాలర్లు, ప్లాటినమ్ 0.5 శాతం పెరిగి 727.06 వద్ద ఉంది. కానీ ఈ లోహాలు 2008 తర్వాత ఈ క్వార్టర్‌లో భారీ నష్ట శాతాన్ని నమోదు చేశాయి. వెండి ధర ఔన్స్ 0.7 శాతం పడిపోయి 14.02 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 2013 తర్వాత ఓ క్వార్టర్‌లో వెండి భారీ నష్ట శాతాన్ని నమోదు చేసింది.

గోల్డ్ ఫ్యూచర్స్..
దేశీయంగా బంగారం ధరలు రూ.43,200 నుండి రూ.44,100 మధ్య ఈ వారం ఉండవచ్చునని బులియన్ నిపుణులు చెబుతున్నారు. గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ డెలివరీ సోమవారం ఈవినింగ్ ట్రేడ్‌లో రూ.229 (0.53 శాతం) పెరిగి రూ.43,800 వద్ద, జూన్ డెలివరీ రూ.1 తగ్గి (0.14 శాతం) రూ.43,484 వద్ద ట్రేడ్ అయింది. ఆగస్ట్ కాంట్రాక్ట్ రూ.161 తగ్గి రూ.43,407గా ఉంది.


Click it and Unblock the Notifications