గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతోన్నాయి. డాలర్ బలహీన పడటంతో పుత్తడి ధర పెరుగుతున్నట్లు చెబుతున్నారు. తాజాగా బంగారం ధర రూ.430 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వర్ణం ధర రూ. రూ. 65,570 పెరిగింది. వెండి కిలో ధర రూ.100 పెరిగి రూ.75,100 చేరింది.హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 65,560గా ఉంది.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధఱ రూ.400 పెరిగి రూ.60,100గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.65,570గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,570 ఉండగా.. చెన్నైలలో పది గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.66,450గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,250గా ఉండగా.. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 66,550గా ఉంది.

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,900గా ఉంది. హైదరాబాద్, కరీంనగర్, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.78,400గా ఉంది. బెంగళూరులో మాత్రం తక్కువగా రూ.74,600గా ఉంది. ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ యొక్క వ్యాఖ్యలు జూన్‌లో మొదటి US రేటు తగ్గింపుపై పెట్టుబడిదారుల ఆశలను బలపరిచినందున, శుక్రవారం US బంగారం ధరలు ఐదు నెలల్లో వారి అతిపెద్ద వారపు జంప్‌కు దారితీశాయి.
డాలర్ ఇండెక్స్ ఐదు వారాల కనిష్ట స్థాయికి చేరడంతో పాటు అమెరికాల్లో వడ్డీరేట్లు తగ్గించే అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా బంగారం నాణ్యతను బట్టి ధర ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం అంటే ఫ్యూర్ గోల్డ్. అలాగే 22 క్యారెట్ల బంగారం అంటే అందులో రాగి కలిసి ఉంటుంది.


Click it and Unblock the Notifications