మకర సంక్రాంతి, పొంగల్, మాఘ్ బిహు వంటి ప్రధాన పండుగలకు ముందు భారతదేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరగడం సాధారణ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేయడం భారతీయ సంప్రదాయంలో కీలకమైన భాగం కావడంతో.. ధరల పెరుగుదల కుటుంబ బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా పెరగడం గృహ వినియోగదారుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
భారతదేశంలో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. జనవరి 11వ తేదీ ఆదివారం ఉదయం నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములకు రూ.24,700 పెరిగింది. అదే సమయంలో 10 గ్రాములకు రూ.2,470 పెరిగింది. ఈ భారీ పెరుగుదలతో బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. జనవరి నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు బంగారం ధరలు దాదాపు 4 శాతం పెరిగినట్లు మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి.

ఈరోజు ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల Gold 10 గ్రాములకు రూ.1,40,470కి చేరింది. 100 గ్రాముల ధర రూ.14,04,600గా నమోదైంది. గ్రాము ధర రూ.14,046గా ఉంది. అదే విధంగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,28,750గా, 100 గ్రాములకు రూ.12,87,500గా ఉంది. గ్రాము ధర రూ.12,875గా నమోదు కాగా.. ఇది గత రోజుతో పోలిస్తే రూ.115 పెరిగింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పెరిగింది. 10 గ్రాములకు రూ.1,05,340గా, 100 గ్రాములకు రూ.10,53,400గా ఉంది.
వెండి ధరలు కూడా రెండు రోజుల క్షీణత తర్వాత తిరిగి పుంజుకున్నాయి. జనవరి 8, 9 తేదీల మధ్య వెండి ధరలు రూ.8 వేల వరకు పడిపోయినా, జనవరి 11న ఒక్కరోజే రూ.11 వేలు పెరిగి కిలో వెండి ధర రూ.2.60 లక్షలకు చేరింది. 100 గ్రాముల వెండి ధర రూ.2,600గా, 10 గ్రాముల ధర రూ.26,000గా ఉంది. జనవరి నెలలో ఇప్పటివరకు వెండి ధరలు 9 శాతానికి పైగా పెరిగినట్లు అంచనా.
ఇక రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయా అనే ప్రశ్నకు మార్కెట్ నిపుణులు మిశ్రమ సంకేతాలు ఇస్తున్నారు. కోటక్ సెక్యూరిటీస్‌కు చెందిన కమోడిటీ రీసెర్చ్ నిపుణుడు కైనత్ చైన్వాలా మాట్లాడుతూ.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 500 శాతం వరకు సుంకాలు విధించే అవకాశాలు మార్కెట్లో అనిశ్చితిని పెంచుతున్నాయని తెలిపారు. ఈ చర్య అమలులోకి వస్తే.. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి, gold, వెండి వంటి సురక్షిత ఆస్తులపై డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
అయితే, ఈ నిర్ణయం ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టు తీర్పుపై ఆధారపడి ఉందని తెలిపారు. కోర్టు సుంకాలకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే బంగారం ధరల పెరుగుదల కొంతమేర పరిమితం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా పండుగ సీజన్, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, వడ్డీ రేట్ల అంచనాలు కలిసి బంగారం, వెండి ధరలను రాబోయే రోజుల్లో మరింత అస్తిరంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications