బంగారం ధరల పతనంపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తీవ్ర హెచ్చరిక.. ఈ స్ఠాయికి పడిపోతే చాలా ప్రమాదమంటూ..

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ప్రస్తుతం పసిడి ధర ఔన్సుకు సుమారు 4,063.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే Gold ధర ఔన్సుకు 3,857 డాలర్ల కంటే దిగువకు పడిపోతే అది మరింత తీవ్రమైన దిద్దుబాటుకు (Correction) గురయ్యే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.

ఒకవేళ ఈ మద్దతు స్థాయిని కోల్పోతే.. తదుపరి కీలక సాంకేతిక మద్దతు 3,500 డాలర్ల వద్ద లభించవచ్చని భావిస్తున్నారు. ఇది జనవరిలో నమోదైన గరిష్ట స్థాయిల నుండి దాదాపు 37 శాతం పతనాన్ని సూచిస్తుంది. గతంలో Gold ధరల్లో వచ్చిన భారీ క్షీణతల ఆధారంగా చూస్తే.. ఈ స్థాయి వద్ద ఒక ముఖ్యమైన కనిష్ట స్థాయి (Bottom) ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) గోల్డ్ ప్రైస్ పిఎమ్ గత వారం 1 శాతం తగ్గి 4,027 డాలర్లకి చేరడంతో.. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం క్షీణత 7.8 శాతానికి చేరుకుంది.

World Gold Council WGC Gold Price Gold Price Prediction Gold Outlook Gold Correction Gold Support Level Gold Market Spot Gold Bullion Market Precious Metals Gold Investment Gold Forecast Business News Gold News WGC

అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇటీవల జరిగిన సమావేశంలో 9-3 ఓట్ల తేడాతో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. వడ్డీ రేట్ల విధానంలో ఆశించిన రీతిలో కోతలు లేకపోవడం, భవిష్యత్ అంచనాలు మారడం పసిడి ధరలపై ఒత్తిడిని పెంచింది. దీనికి తోడు అమెరికా-ఇరాన్ మధ్య వివాదాలు చమురు ధరలు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతున్నాయి.

Also Read

పెట్టుబడిదారులు తమ వ్యూహాలను పునఃసమీక్షించుకోవడంతో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి (Gold ETFs) నిధుల ప్రవాహం తగ్గింది. కామెక్స్ (COMEX) మార్కెట్‌లో నికర లాంగ్ పొజిషన్లు కూడా క్షీణించాయి. కాంట్రాక్టుల గడువు ముగియడంతో ఆప్షన్స్ ట్రేడర్లు తమ బేరిష్ పొజిషన్లను తగ్గించుకున్నప్పటికీ.. మార్చి ప్రారంభం నుండి ఉన్న పతన ధోరణి పరిధిలోనే బంగారం కదలికలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో జపనీస్ యెన్ బలపడటం పసిడికి కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. కరెన్సీ మార్కెట్లలో అమెరికా, జపాన్ దేశాలు సమన్వయంతో జోక్యం చేసుకోవడం వల్ల జపనీస్ యెన్ పుంజుకుంది. ఒకవేళ బలమైన యెన్, బలహీనమైన డాలర్ ధోరణి కొనసాగితే, అది బంగారం ధరలకు ఊతమిచ్చే అవకాశం ఉంది. సాంకేతికంగా చూస్తే.. బంగారం ధర ఔన్సుకు 3,943 డాలర్ల కంటే దిగువకు చేరితే ప్రస్తుత తగ్గుదల శ్రేణి ముగిసి.. 3,857 డాలర్ల నుండి 3,887 డాలర్ల శ్రేణిలో తదుపరి కీలక మద్దతు లభిస్తుంది.

రాబోయే రోజుల్లో ఫెడరల్ రిజర్వ్ తీసుకోబోయే ద్రవ్య విధాన నిర్ణయాలు, ఆర్థిక గణాంకాలే బంగారం ధరలకు ప్రధాన అంశాలుగా నిలవనున్నాయి. జూలై నెలకు సంబంధించిన తయారీ, సేవల పీఎంఐ (PMI) గణాంకాలు బలంగా నమోదు కావడం ఫెడ్ కఠిన వైఖరిని బలపరచవచ్చు. అదే సమయంలో ఉపాధి కల్పన (పేరోల్) డేటా మందగించే అవకాశం ఉండటం, కొత్త చర్చల ప్రక్రియ ద్వారా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గుతున్న సంకేతాలు కనిపించడం వడ్డీ రేట్ల పెంపు భయాలను కొంతవరకు తగ్గించవచ్చని నివేదిక స్పష్టం చేస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+