భారత మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు ఆల్ టైమ్ హై స్థాయి నుండి దాదాపు రూ.12,700 తగ్గడం పెట్టుబడిదారులలో చర్చనీయాంశమైంది. కొన్ని వారాల క్రితం వరకూ బంగారం బుల్లిష్ ట్రెండ్‌లో నడుస్తూ రికార్డు స్థాయిలోకి చేరినప్పుడు ఇప్పుడు ఈ క్షీణత మరింత లోతుగా వెళ్తుందా, లేక ఇది ఒక కొనుగోలు అవకాశమా అనే అనే సందేహం పెట్టుబడిదారుల్లో పెరుగుతోంది.
10 గ్రాముల బంగారం ధర రూ.1,32,294 నుంచి 9.6 శాతం తగ్గి రూ.1,19,605 వద్దకు వచ్చింది. MCX డిసెంబర్ కాంట్రాక్ట్ కూడా 10 గ్రాములకు రూ.1,19,646 వద్ద స్థిరపడింది, ఇది రోజు వారీగా 1.08% తగ్గుదల. కొంతసేపు ఇది రూ.1,18,450 వరకు పడిపోయి ఆపై స్వల్పంగా కోలుకుంది.
అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటంతో బంగారం ఆకర్షణ తగ్గిందని Augmont Research హెడ్ రెనిషా చైనాని తెలిపారు.ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయం ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉన్నారు. తక్కువ వడ్డీ రేట్లు వస్తే బంగారం డిమాండ్ మళ్లీ పెరగొచ్చని ఆమె పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరగబోయే వాణిజ్య ఒప్పందం కూడా ధరల దిశను నిర్ణయించనుంది.

PrithviFinmart Commodities Research విశ్లేషకుడు మనోజ్ కుమార్ జైన్ ప్రకారం, బంగారం ప్రధాన మద్దతు స్థాయిలు 3,870 డాలర్ల వద్ద, వెండి 46.50 డాలర్ల వద్ద ఉన్నాయని తెలిపారు.ఫెడ్ పాలసీ సమావేశం ఫలితాల ఆధారంగా gold మరింత అస్థిరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.
దేశీయ మార్కెట్లో ఈ వారానికి బంగారానికి మద్దతు రూ. 1,17,000 నుండి రూ. 1,18,000 వద్ద ఉంది.ఈ రేటు మధ్యలో బంగారం కొంటే లాభాలు బుక్ చేసుకుంటారు. ఇక నిరోధం రూ. 1,20,500 నుండి రూ. 1,21,400 వద్ద ఉందని అంచనా. ఈ స్థాయిల్లో నిలబడి ఉంటే ధర రూ. 1,21,500 వరకు రికవర్ అయ్యే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు. అంటే ఈ స్థాయిలో ఉన్నప్పుడు బంగారం కొనకుండా తగ్గేదాకా వేచి చూడాలని చెబుతున్నారు.
LKP Securities VP జతీన్ త్రివేది మాట్లాడుతూ.. ఫెడరల్ రిజర్వ్ సమావేశం, యుఎస్-చైనా సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. బంగారం ధరలు మరో రూ.2,500 తగ్గి రూ.1,18,450 వద్ద ట్రేడవుతున్నాయి. ఇప్పుడు దృష్టి ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయంపైనే ఉందని త్రివేది అన్నారు.త్రివేది ప్రకారం.. బంగారం తక్షణ మద్దతు రూ. 1,16,500 నుండి రూ.1,18,000 వద్ద ఉంది. అంటే ఈ స్థాయి వద్ద Gold కొనుగోలు చేస్తే కాస్త లాభాల బాట పట్టవచ్చు. ఇక నిరోధం రూ. 1,21,000 నుండి రూ. 1,22,000 వద్ద ఉండవచ్చని చెప్పారు. ఈ ధర వద్ద కొనడం ఆపేయాలని తగ్గేవరకు వేచి చూడాలని చెబుతున్నారు.
ప్రస్తుతం బంగారం కొనుగోలుపై జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. మరింత తగ్గుదల వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ స్థాయిలను ప్రవేశ అవకాశంగా పరిగణించవచ్చని అభిప్రాయపడుతున్నారు. బంగారం, వెండి ప్రస్తుతం షార్ట్ కవరింగ్ దశలో ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తమ పొజిషన్‌లను కొనసాగించవచ్చని మనోజ్ జైన్ చెప్పారు.
ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు గ్లోబల్ ఆర్థిక సూచీలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, వాణిజ్య ఒప్పందాలు, జియోపాలిటికల్ సెంటిమెంట్‌పై ఆధారపడి మారతాయి.తక్షణం అస్థిరత ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో బంగారం ఒక సురక్షిత పెట్టుబడి ఆశ్రయంగానే నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications