బంగారం ఈ రేటు వద్దకు వస్తేనే కొనుగోలు చేయండి.. సామాన్యులకు ఆర్థిక నిపుణులు కీలక సూచన..
అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు పసిడి మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. Gold ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. పెట్టుబడిదారులు అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పసిడి మీద పెట్టుబడులు పెట్టాలా వద్దా అనే సందేహాంలో మునిగిపోయారు. ధరలు ఈ మధ్య కాలంలో కుప్పకూలడంతో పసిడి భవిష్యత్తు ముందు ముందు ఎలా ఉంటుందోనని టెన్సన్ మధ్య నలిగిపోతున్నారు.
ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆర్థిక పరిస్థితుల వల్ల Gold ధరలు తగ్గుదల ధోరణిలో ట్రేడవుతున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సీనియర్ అనలిస్ట్ మానవ్ మోడీ తెలిపారు. పశ్చిమాసియాలో ముఖ్యంగా హార్ముజ్ జలసంధి సమీపంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల అనంతరం ఇరాన్ లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడుల వల్ల ముడి చమురు ధరలు పెరిగాయి.

ఇది ఇంధన ఆధారిత ద్రవ్యోల్బణ భయాలను మళ్లీ పెంచడంతో పాటు ప్రపంచ సరఫరా మార్గాలపై అనిశ్చితిని సృష్టించింది. చమురు ధరల పెరుగుదల అమెరికా డాలర్, ట్రెజరీ ఈల్డ్స్‌కు బలాన్ని ఇచ్చింది. ఒకవేళ ద్రవ్యోల్బణం ఇలాగే స్థిరంగా కొనసాగితే.. ఈ ఏడాది చివర్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణ అంచనాలపై మరింత స్పష్టత కోసం పెట్టుబడిదారులు ఈ వారం విడుదల కానున్న అమెరికా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI), ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (PPI) గణాంకాలతో పాటు ఫెడ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ ఇచ్చే వార్తలపై దృష్టి సారించారు.
సాంకేతికంగా చూస్తే రోజువారీ చార్టులో బంగారం వరుసగా తక్కువ కనిష్టాలను నమోదు చేస్తూ ఒక అవరోహణ ఛానెల్‌లో ట్రేడ్ అవుతోంది. ధరలు ప్రస్తుతం 20-రోజుల పయనం కంటే దిగువనే కొనసాగుతుండటం మార్కెట్లో అమ్మకందారుల ఆధిపత్యాన్ని సూచిస్తోంది. బోలింగర్ బ్యాండ్స్ విశ్లేషణ ప్రకారం.. 20-రోజుల సగటు రూ. 145,806 వద్ద ఉండగా.. ఎగువ బ్యాండ్ రూ. 152,446 వద్ద..ఇక దిగువ బ్యాండ్ రూ. 139,166 వద్ద ఉన్నాయి.
బంగారం ప్రస్తుతం మధ్య బ్యాండ్‌కు దిగువన ట్రేడ్ అవుతూ.. క్రమంగా దిగువ బ్యాండ్‌ను సమీపిస్తుండటం వల్ల దాని ఊపు బలహీనపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ ధర రూ. 145,800 పైన నిలకడగా ముగిస్తే సెంటిమెంట్ మెరుగుపడి ఎగువ బ్యాండ్ వైపు వెళ్ళవచ్చు.. కానీ రూ. 139,200 కంటే దిగువకు పడిపోతే మార్కెట్ పతనం మరింత వేగవంతంగా జరగవచ్చు. ఈ ధర వద్ద సామాన్యులు కొనుగోలు చేస్తే లాభాలు పొందవచ్చు. తరువాత పెరిగితే కాస్త ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది.
ఇక ఇటీవల నమోదైన ప్రధాన కనిష్ట స్థాయి రూ. 118,000 నుండి రికార్డు గరిష్ట స్థాయి రూ. 179,000 ఆధారంగా లెక్కించిన ఫైబొనాచీ రీట్రేస్‌మెంట్ ప్రకారం.. 50 శాతం స్థాయి రూ. 148,500 వద్ద, 61.8 శాతం స్థాయి రూ. 141,300 సమీపంలో ఉన్నాయి. బంగారం ప్రస్తుతం కీలకమైన 61.8 శాతం రీట్రేస్‌మెంట్ స్థాయి వద్దే ట్రేడవుతోంది, దీనిని లోతైన దిద్దుబాటుకు ముందు ఉండే చివరి ప్రధాన మద్దతు రేఖగా భావిస్తారు.
ఈ జోన్ పైన ధర నిలదొక్కుకుంటే తక్కువ ధరకు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహం లభిస్తుంది. కానీ దీని కిందకు నిర్ణయాత్మకంగా పడిపోతే ధరలు రూ. 138,500 నుండి రూ. 137,000 వైపు పయనించవచ్చు. మొత్తంమీద మార్కెట్ దృక్పథం బేరిష్ నుండి న్యూట్రల్‌గా ఉంది.. ఈ వారంలో బంగారం కోలుకుంటుందా లేదా దాని పతనమవుతుందా అనేది ప్రధానంగా రూ. 141,300 మద్దతు జోన్ ఆధారంగానే నిర్ణయించబడుతుందని తెలుస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
