బంగారం ధరల దిశను ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం నడిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయంపై గణనీయంగా ఆధారపడి ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కమోడిటీ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు మానవ్ మోడీ పేర్కొన్నారు. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలే రాబోయే రోజులలో బంగారం మార్కెట్ వోలాటిలిటీనీ నిర్ణయిస్తాయని ఆయన అన్నారు.
గత వారం బంగారం పలు వారాల గరిష్ట స్థాయిలను తాకింది. ఇందుకు ప్రధాన కారణం మార్కెట్లలో వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు స్థిరంగా కొనసాగడం. విధాన రూపకర్తలు ఇచ్చిన సాఫ్ట్ కమ్యూనికేషన్, బలహీనమైన అమెరికా ఆర్థిక డేటా విడుదల.. ప్రత్యేకించి ADP ప్రైవేట్ ఉద్యోగాల్లో ఊహించని 32 వేల తగ్గుదల కారణగాలు చెప్పవచ్చు. 2023 నుండి నియామకాలు తగ్గిపోవడం కూడా బంగారపు ర్యాలీకి మద్దతు ఇచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లు 25 బేసిస్ పాయింట్ల కోతకు 85 నుంచి 90 శాతం సంభావ్యత మధ్య ధర నిర్ణయిస్తున్నాయి.

అమెరికా-రష్యా మధ్య ఉక్రెయిన్ వివాదంపై జరిగిన సంభాషణలు ఫలితం లేకపోవడం కూడా గ్లోబల్ మార్కెట్లలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతను పెంచింది. దానివల్ల బంగారానికి అదనపు మద్దతు లభించింది. ట్రెజరీ దిగుబడులు తగ్గడం కూడా బంగారాన్ని మరింత ఆకర్షణీయమైన పెట్టుబడిగా మార్చింది. అయితే PCE ద్రవ్యోల్బణ నివేదిక, ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యల అంచనాతో కొందరు ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకోవడం వల్ల తాత్కాలిక సరిదిద్దు కనిపించింది.
భారతదేశం, చైనాలో భౌతిక Gold కొనుగోళ్లు తగ్గినప్పటికీ, కొనుగోలుదారులు ధరల మార్పు కోసం వేచి ఉండటమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ETFల్లో ప్రవాహం పెరగడం బంగారంపై పెట్టుబడి సెంటిమెంట్‌ను బలపరిచింది. మరోవైపు గత కొద్ది రోజుల్లో 3.3 శాతం పెరిగిన వెండి కొంత లాభాల స్వీకరణను చూసింది. అయినప్పటికీ లండన్, చైనా మార్కెట్లలో ఇన్వెంటరీలు తక్కువగా నిల్వ ఉండటం..2026 వరకు కొనసాగనున్న నిర్మాణాత్మక లోటు కారణంగా వెండిపై బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందని అంచనా.
ఈ వారం గ్లోబల్ కమోడిటీ మార్కెట్ల దృష్టి పూర్తిగా ఫెడరల్ రిజర్వ్ చివరి విధాన సమావేశంపై ఉండనుంది. వడ్డీ రేట్లలో మార్పు జరిగే అవకాశాలపైన కూడా భారీగా చర్చ సాగుతున్నది. పావెల్ ప్రసంగం, అంచనా ద్రవ్యోల్బణ స్థాయిలు, రాబోయే ఆర్థిక డేటా అన్ని కలిపి బంగారపు ధరలపై కీలక ప్రభావాన్ని చూపనున్నాయి.
మార్కెట్లు సమావేశం వరకు అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాయి. మానవ్ మోడీ విశ్లేషణ ప్రకారం, ప్రస్తుతం బంగారం పెరుగుదల రేంజ్‌లో ట్రేడ్ అవుతోంది. వచ్చే 10 రోజుల్లో ధరలు రూ. 128,000 నుంచి రూ. 133,000 పరిమితిలో ఉండే అవకాశం ఉంది. వడ్డీ రేట్లపై ఫెడ్ తీసుకునే నిర్ణయమే బంగారం తదుపరి ప్రధాన దిశను నిర్ణయిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications