Silver Price Today: 2025 జూలై 12, శుక్రవారం భారతదేశంలో వెండి ధరలు సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేశాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ. 1,10,000కు మించి ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్‌లో వెండి గ్రమ్ ధర రూ.109.90 వద్ద ఉండగా, కిలో ధర రూ. 1,09,900కు చేరుకుంది. ఇది దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులలో వెండిపై పెట్టుబడి ఆసక్తి పెరిగిన సూచనగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయంగా కూడా వెండి ధరలు పెరిగాయి. ప్రపంచ మార్కెట్లలో వెండి 0.4% పెరిగి ఔన్సుకు 37.17 డాలర్లకి చేరుకుంది. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో వెండి బంగారం వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కోసం పెట్టుబడిదారుల తపనపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు దిగుమతి సుంకాలు, వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ద్రవ్యోల్బణ భయాలు పెరిగి పెట్టుబడిదారులు వెండి వైపు మళ్లుతున్నారు.ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం భారత మార్కెట్‌లో వెండి ధరలను మరింతగా పెంచుతోంది.ప్రపంచ మార్కెట్ ధరలు పెరగడం, వ్యాపార ఉద్రిక్తతలు.. భవిష్యత్తు ఆర్థిక అస్థిరతలు వెండి ధరల పెరుగుదలకి దోహదపడుతున్నాయి.

జూన్ 12 శనివారం దేశంలో వెండిధరలను చూస్తూ.. గ్రాము 4రూపాయలు పెరిగి 125 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ఇప్పుడు రూ. 1,25,000 పలుకుతోంది. ఏకంగా 4 వేల రూపాయలు పెరిగింది.
MCX వెండి ఫ్యూచర్స్‌కి మద్దతు స్థాయి కిలోకు రూ. 1,08,480గా ఉండగా, నిరోధక స్థాయి రూ. 1,10,700గా గుర్తించబడింది. ఈ స్థాయిలు మార్కెట్‌లో కీలకమైన గరిష్ఠ/కనిష్ఠ స్థాయిలుగా పరిగణించబడతాయి. మార్కెట్ విశ్లేషకులు ధ్రువీకరిస్తున్నట్లు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెండి ధరలు రూ. 1,12,000 వరకు కూడా చేరే అవకాశం ఉంది.
మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి మాట్లాడుతూ, స్వల్పకాలికంగా మార్కెట్‌లు అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. కానీ వెండి ధరలు మరింత పెరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం అని అన్నారు. మరోవైపు ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ మాట్లాడుతూ.. వెండి సురక్షిత పెట్టుబడిగా మళ్లీ ప్రజాదరణ పొందుతోందని స్పష్టం చేశారు.
మీ ఏరియాలో వెండి ధరలు చెక్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోండి
వెండి వంటి విలువైన లోహాలు సాధారణంగా భద్రతాత్మక పెట్టుబడులుగా పరిగణించబడతాయి. మార్కెట్‌లు అస్థిరతను ఎదుర్కొంటున్నప్పుడు, పెట్టుబడిదారులు ఈక్విటీల నుండి వెండి, బంగారం వంటి లోహాల వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు కూడా వెండి పెరుగుదలకు కారణం అవుతున్నాయి. ఇక వెండి ధరల పెరుగుదలతోపాటు, మెటల్స్, మైనింగ్ కంపెనీల షేర్లు కూడా లాభాల్లోకి వచ్చేశాయి.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.


Click it and Unblock the Notifications