దేశీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లు ప్రస్తుతం అస్థిరంగా ఉన్నప్పటికీ.. బంగారం అక్టోబర్ 2025లో అద్భుతమైన నెలవారీ లాభాలను నమోదు చేసింది. బంగారం ధరలు దాదాపు ఈ నెలలో 5 శాతం పెరిగి రూ. 1,32,294 వద్ద గరిష్టాన్ని తాకాయి. వెండి కూడా అదే మార్గంలో నడుస్తూ కిలోకు రూ. 1,70,415 రికార్డు స్థాయిని తాకింది. ఈ ర్యాలీకి పలు అంశాలు కారణమయ్యాయి.
US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలతో పాటుగటా దీపావళి సీజన్‌లో పెరిగిన కొనుగోళ్లు, కేంద్ర బ్యాంకుల భారీ బంగారం కొనుగోళ్లు Gold ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషించాయి. అంతేకాకుండా ఈక్విటీ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత, ప్రపంచ ఆర్థిక మందగమన భయం వల్ల పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా (safe haven asset) మళ్లీ పరిగణిస్తున్నారు. కజకిస్తాన్, బ్రెజిల్ లాంటి దేశాలు Q3లో కలిపి దాదాపు 220 టన్నుల బంగారంకొనుగోలు చేయడం మార్కెట్‌కు బలమైన మద్దతు ఇచ్చింది.

మెహతా ఈక్విటీస్ కమోడిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి మాట్లాడుతూ.. బంగారం ఈ నెలలో లాభాలు నమోదు చేసినప్పటికీ, తాత్కాలికంగా కొంత ఒత్తిడి కనిపించవచ్చని తెలిపారు. మార్కెట్ 4,000 డాలర్ల స్థాయికి దిగువన నెలవారీ ముగింపు ఇస్తే.. బులియన్‌పై కొద్దిగా ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. అయితే 3,850 డాలర్ల నుంచి 4,170 డాలర్ల పరిధిలో బంగారం స్థిరంగా ఉంటుందని మేము అంచనా వేస్తున్నామని అన్నారు.భారతీయ మార్కెట్లో వ్యాపారులు రూ. 1,17,500 వద్దకు వస్తే కొనుగోలు చేయాలని సూచించారు. అప్పుడు లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. ఇక రూ. 1,22,000 దాటితే ఎట్టి పరిస్థితుల్లోనే కొనవద్దని తెలిపారు. ఆ స్థాయిలో కొంటే నష్టాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
డాలర్ ఇండెక్స్ బలపడటం బంగారం ధరలకు తాత్కాలిక ఒత్తిడి తెస్తోంది. అదే సమయంలో US ఫెడ్ డిసెంబర్ రేటు కోతలు నిలిపివేయవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నాయి.CME FedWatch Tool ప్రకారం, డిసెంబర్‌లో రేటు కోత అవకాశం 75 శాతం కంటే తక్కువగా ఉంది. ICICI Direct నివేదిక ప్రకారం బలమైన కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు,సుంకాల ఉద్రిక్తతలు,ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం సమీప కాలంలో కూడా మద్దతు పొందుతుందని పేర్కొంది.
రాహుల్ కలాంత్రి అంచనా ప్రకారం.. బంగారం రూ. 118,800 కంటే ఎక్కువగా ఉంటే రూ. 122,800 స్థాయిని చేరవచ్చు. వెండి రూ. 145,000 వద్ద మద్దతుతో రూ. 149,800 వరకు చేరవచ్చు.ఇక అనుజ్ గుప్తా (IIFL సెక్యూరిటీస్) అంచనా ప్రకారం..US-చైనా వాణిజ్య చర్చలపై సానుకూల వాతావరణం సేఫ్ హెవెన్ డిమాండ్‌ను తగ్గిస్తుంది. కానీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తిరిగి పెరిగితే బంగారం మళ్లీ బలపడుతుందచి చెబుతున్నారు.
క్లుప్తంగా చెప్పాలంటే బంగారం ప్రస్తుతం అస్థిర స్థితిలో ఉన్నప్పటికీ, దీని దీర్ఘకాలిక దిశ ఇంకా బుల్లిష్‌గానే ఉంది. నవంబర్ నెలలో ఇది 3,800 డాలర్ల నుండి 4,100 డాలర్ల మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ. 1,16,000 నుంచి రూ. 1,22,000 మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది.ఈ ట్రేడ్ మధ్యలో లాభాలు బుక్ అయ్యే అవకాశం ఉంది.ఇక వెండి పారిశ్రామిక డిమాండ్ ఆధారంగా మరింత స్థిరంగా ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

చైనా మాములుది కాదు..ఇరాన్ యుద్ధంతో ప్రపంచదేశాలు అల్లాడుతుంటే.. అది మాత్రం బంగారంతో..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..



Click it and Unblock the Notifications