ఒక ఔన్సు ( సుమారు28.35 గ్రాములు) బంగారం ధర 6,600 డాలర్లకు (సుమారు రూ 5.5 లక్షలు) చేరుకుంటుందని విన్నప్పుడు చాలామందికి ఇది అసాధ్యంగా అనిపించవచ్చు. అయితే జెఫరీస్ సంస్థలో గ్లోబల్ ఈక్విటీ స్ట్రాటజీ హెడ్ క్రిస్ వుడ్ మాత్రం ఇది చాలా సహజమని అంటున్నారు. ఆయన లెక్కలు చెబుతున్నది Gold ధరలు ఇంత ఎత్తుకు వెళ్లడం కేవలం ఊహ కాదు, గత చరిత్రలోనూ ఇది జరిగిందని చెబుతున్నారు.
1980 జనవరిలో.. అమెరికాలో Gold ధర అత్యధిక స్థాయికి వెళ్లింది. ఆ సమయంలో ఒక ఔన్సు బంగారం ధర.. అమెరికా ప్రజల సగటు వార్షిక ఖర్చు చేయగల ఆదాయం (per capita disposable income)లో 9.9 శాతంగా ఉండేది. నేటి లెక్కల ప్రకారం ఆ విలువ 8,551 డాలర్లకి సమానం అవుతుంది.

ఇప్పటి బంగారం ధర మాత్రం 3,670 డాలర్లు మాత్రమే ఉంది. ఇది అమెరికన్ల ప్రస్తుత సగటు ఖర్చు చేయగల ఆదాయం 66,100 డాలర్లలో కేవలం 5.6 శాతం మాత్రమే. అంటే.. బంగారం ధర 1980లో ఉన్న స్థాయికి చేరాలంటే కనీసం 6,571 డాలర్లకి పెరగాలి. అందుకే క్రిస్ వుడ్ ఔన్సుకు 6,600 డాలర్లు అనేది ఒక సహజమైన లక్ష్యమని చెబుతున్నారు.
క్రిస్ వుడ్ ఎప్పటినుంచో బంగారంపై బలమైన నమ్మకంతో ఉన్నారు. 2002 నుంచి ఆయన మోడల్ పోర్ట్‌ఫోలియోలో 40 శాతం బంగారానికే కేటాయించారు. 2020లో బిట్‌కాయిన్‌ను చేర్చిన తర్వాత ఈ వాటాను 50 శాతం నుంచి 40 శాతంకు తగ్గించారు. అయితే బంగారం ప్రాధాన్యం అలాగే కొనసాగుతోంది. ఆయన దృష్టిలో బంగారం కేవలం ఒక లోహం కాదు. ఇది ద్రవ్యోల్బణం (inflation), ఆర్థిక సంక్షోభం లేదా భౌగోళిక ఉద్రిక్తతల సమయంలో "సేఫ్ హేవెన్" అంటే సురక్షిత పెట్టుబడి అని చెబుతారు.
క్రిస్ వుడ్ గత 20 ఏళ్లలో పలు దఫాలుగా వేసిన బంగారం ధర అంచనాలు
2002లో 3,400 డాలర్లు
2005లో 3,700 డాలర్లు
2016లో 4,200 డాలర్లు
2020లో 5,500 డాలర్లు
ఇప్పుడు ఆయన కొత్త అంచనా 6,600 డాలర్లు
ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు తగ్గించింది. ఈ నిర్ణయం తర్వాత బంగారం ధర కొద్దిగా తగ్గింది. దీనిని వార్తలపై అమ్మకం (sell on news) ప్రభావం అని ఆయన అంటారు. అయినా దీని వల్ల పెద్దగా భయం అవసరం లేదని క్రిస్ వుడ్ భావిస్తున్నారు.ప్రస్తుతం ప్రధాన దృష్టి అమెరికా ట్రెజరీ బాండ్లపై ఉంది. అవి ఈ సడలింపు ద్రవ్య విధానాన్ని ఎలా అంగీకరిస్తాయన్నది బంగారం భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుంది.
2024లో బంగారం ధరలు 27 శాతం పెరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 39 శాతం వృద్ధిని సాధించాయి. దీనికి ప్రధాన కారణాలను మనం చూసినట్లయితే.. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గుతాయని ఉన్న అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. కేంద్ర బ్యాంకుల భారీ బంగారం కొనుగోళ్లు అని చెప్పవచ్చు. ఈ కారణాల వల్లే క్రిస్ వుడ్ ఔన్సుకు 6,600 డాలర్లు అనేది అసాధ్యం కాదు, అది సహజమైన స్థాయి అని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

చైనా మాములుది కాదు..ఇరాన్ యుద్ధంతో ప్రపంచదేశాలు అల్లాడుతుంటే.. అది మాత్రం బంగారంతో..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు



Click it and Unblock the Notifications