బంగారం కావాలంటే చైనాకు పోవాల్సిందే.. ఒక్క వ్యూహంతో లండన్, న్యూయార్క్ మార్కెట్లను కుప్పకూల్చబోతున్న బీజింగ్..

Gold News: అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు అనగానే ప్రతీఒక్కరికీ ముందుగా గుర్తొచ్చేవి ఇక్కడ ధర ఎంత, భవిష్యత్తులో అది పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే ప్రశ్నలే. అయితే గ్లోబల్ బులియన్ విపణిలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. అసలు ప్రధాన లావాదేవీలు ఎక్కడ జరుగుతున్నాయి, వాటి అకౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగుతోంది, కొనుగోలుదారులకు బంగారం ఎలా డెలివరీ అవుతోంది? ఇప్పటివరకు ఈ ప్రక్రియలో లండన్, న్యూయార్క్ మార్కెట్లు ఆధిపత్యం చెలాయిస్తుండగా.. ఇప్పుడు ఈ ఆధిపత్యాన్ని తనవైపు తిప్పుకోవడానికి డ్రాగన్ కంట్రీ చైనా పావులు కదుపుతోంది. ఆసియా ఖండంలో హాంకాంగ్‌ను అంతర్జాతీయ బంగారు వాణిజ్య రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చైనా భారీ ప్రణాళికలను చాలా వేగవంతం చేసింది.

హాంకాంగ్ ఆర్థిక వ్యవహారాల మంత్రి క్రిస్టోఫర్ హుయ్ తెలిపిన వివరాల ప్రకారం.. హాంకాంగ్‌ను అంతర్జాతీయ బంగారు వ్యాపారానికి ఒక కీలక ఆసియా కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చారు. లండన్ వంటి అతిపెద్ద, సుదీర్ఘ చరిత్ర ఉన్న మార్కెట్లకు పోటీగా నిలబడటానికి హాంకాంగ్ వేగంగా రెడీ అవుతోంది. ఇందుకోసం బంగారం కొనుగోలు, అమ్మకాలు, ఆర్థిక చెల్లింపులు, భౌతిక డెలివరీ, సురక్షిత నిల్వ (Vault Storage) సౌకర్యాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నారు.

China gold market China gold reserves 2026 China gold buying global gold market China gold strategy People s Bank of China gold purchases PBOC gold reserves gold price outlook China gold demand Hong Kong gold trading hub yuan gold trading global bullion market China central bank gold buying gold market news London vs China gold market 2026

బంగారు లావాదేవీలను నిశితంగా ట్రాక్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి హాంకాంగ్ ఒక కేంద్రీకృత క్లియరింగ్ ప్లాట్‌ఫామ్‌ను (Central Clearing Platform) రూపకల్పన చేసింది. క్లియరింగ్ అంటే లావాదేవీ యొక్క అకౌంటింగ్ ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయడం అని అర్థం. బంగారాన్ని ఎవరు కొనుగోలు చేశారు, విక్రేత ఎవరు, ఎంత నగదు బదిలీ జరగాలి, బంగారం ఏ డిపాజిటరీలో డెలివరీ కావాలి అన్న విషయాలన్నీ ఈ వ్యవస్థ ద్వారా నమోదవుతాయి. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ప్లాట్‌ఫామ్‌ను 2027 మొదటి త్రైమాసికంలో అధికారికంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది చైనా ప్రభుత్వం.

Also Read

ఈ ప్లాట్‌ఫామ్ 'డెలివరీ వర్సెస్ పేమెంట్' (Delivery versus Payment) పద్ధతిలో పనిచేస్తుంది. అంటే, కొనుగోలుదారు డబ్బు చెల్లించిన మరుక్షణమే బంగారం అందుతుందని, విక్రేత బంగారం అప్పగించిన వెంటనే సొమ్ము ఖాతాలో జమ అవుతుందనే గ్యారెంటీ ఉంటుంది. దీనివల్ల లావాదేవీల సమయంలో తలెత్తే చెల్లింపు ఆలస్యం లేదా బంగారం లభించకపోవడం వంటి క్రెడిట్ రిస్క్‌లు దాదాపు సున్నాకి చేరుతాయి.

హాంకాంగ్, షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజీల మధ్య కుదిరిన ద్వైపాక్షిక పరస్పర ఒప్పందం వల్ల వ్యాపారులకు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న బంగారాన్ని ప్రతిసారీ ఒక మార్కెట్ నుండి మరొక మార్కెట్‌కు భౌతికంగా తరలించాల్సిన అవసరం లేకుండానే కాంట్రాక్టులను సెటిల్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా, ఆసియా టైమ్ జోన్‌లో హాంకాంగ్ కొలువుదీరి ఉండటం వల్ల ఆసియా దేశాల వ్యాపారులకు బులియన్ వర్తకం నిర్వహించడం అత్యంత సులభతరం కానుంది.

ఈ పరిణామం వల్ల చైనా రాత్రికి రాత్రే ప్రపంచ బంగారం ధరలను శాసిస్తుందని భావించడం తొందరపాటే అవుతుంది. ఒక మార్కెట్ బెంచ్‌మార్క్ ధరలను నిర్ణయించాలంటే అక్కడ భారీ సంఖ్యలో కొనుగోలుదారులు, అమ్మకందారులు, బ్యాంకులు, లిక్విడిటీ (ద్రవ్యత) అవసరం. హాంకాంగ్‌లో ట్రేడింగ్ వాల్యూమ్‌లు పెరిగినప్పుడు మాత్రమే గ్లోబల్ ధరలపై చైనా ప్రభావం పెరుగుతుంది.

అంతేకాకుండా ఈ హాంకాంగ్ ప్లాట్‌ఫామ్ కేవలం ఒక వాణిజ్య వసతి వ్యవస్థ మాత్రమే తప్ప.. దీనివల్ల బంగారం ధరలు దానంతట అవే పెరగవు. అంతర్జాతీయంగా పసిడి రేట్లు అనేది గ్లోబల్ డిమాండ్-సరఫరా, యూఎస్ డాలర్ విలువ, వడ్డీ రేట్ల విధానాలు, ద్రవ్యోల్బణం,భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలపైనే ఆధారపడి ఉంటాయి.

కాబట్టి తొలిసారిగా బంగారంలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు కేవలం ఇటువంటి వార్తా కథనాలను చూసి ఆత్రుతతో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆభరణాలపై ఉండే మేకింగ్ ఛార్జీలు, పన్నులు, అలాగే డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఉండే నిర్వహణ ఖర్చులు, నష్టభయాలను పూర్తిగా అధ్యయనం చేశాకే తమ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+