భార్య ముందు చూపుకి భర్త మైండ్ బ్లాక్.. రూ. 8 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 30 లక్షలు చేతికి ..
భారతీయ గృహిణులు పొదుపు చేయడంలో మాత్రమే కాదు.. ఆ పొదుపును ఎక్కడ పెట్టుబడి చేయాలన్న విషయంలోనూ అసాధారణ దూరదృష్టి కలిగి ఉంటారు. పండుగలు, శుభకార్యాలు, బోనస్‌లు, చిన్న ఆదాయాలు ఏ సందర్భమైనా బంగారం కొనడమే ఉత్తమమని భావించే అలవాటు భారతీయ మహిళలలో తరతరాలుగా ఉంది. ఈ బంగారంపై విశ్వాసం సాధారణ భావన కాదని, కాలంతో పరీక్షించబడిన సత్యమని మరోసారి నిరూపిస్తూ.. ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు ఎ కె మందన్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
మందన్ పది సంవత్సరాల క్రితం జరిగిన ఒక చిన్న అనుభవాన్ని ఉదాహరించగా.. ఆ అనుభవం ఇప్పుడు లక్షల మందికి ఆర్థిక జ్ఞానం నేర్పుతోంది. తన భార్యతో కలిసి ఆ సమయంలో తీసుకున్న రెండు భిన్న నిర్ణయాలను ఆయన పోల్చి చూపించారు. ఆయన ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేసి కారు కొనగా, అదే ఎనిమిది లక్షలతో ఆయన భార్య బంగారం కొనుగోలు చేసింది. ఆ రోజుల్లో తన నిర్ణయమే సరైనదని, కారు తీసుకోవడమే ఉపయోగకరమని భావించిన ఆయనకు, నేడు ఆ కారు విలువ కేవలం ఒకటిన్నర లక్ష రూపాయలకే పడిపోయింది. కానీ, అదే సమయంలో భార్య కొనుగోలు చేసిన బంగారం విలువ ఇరవై రెండింతలు పెరిగి, ముప్పై రెండు లక్షల రూపాయలకు చేరింది.

ఈ ఉదాహరణను చెప్పుతూ మందన్ తన హాస్యాన్ని కూడా జోడించాడు. బంగారం ఎందుకు కొంటావు? మనం ఆ డబ్బుతో ఎక్కడికైనా ఐదు రోజుల ట్రిప్ వెళ్లొచ్చు అని అప్పట్లో భార్యకు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. అప్పుడు భార్య ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో క్లాసిక్‌గా మారింది. ఆ ట్రిప్ ఐదు రోజులకే మిగిలిపోతుంది, కానీ బంగారం ఐదు తరాలపాటు నిలుస్తుంది. ఇదే ఆలోచనా విధానం భారతీయ మహిళలను పెట్టుబడుల విషయంలో అజేయులుగా మారుస్తుందని అనేక మంది పేర్కొంటున్నారు.
అలాగే, అదే కాలంలో మందన్ ఒక లక్ష రూపాయలకు మొబైల్ ఫోన్ కొనగా, ఆయన భార్య మరో లక్షకు బంగారం తీసుకుంది. కాలంతో పాటు ఫోన్ విలువ ఎనిమిది వేలకే తగ్గిపోయినప్పటికీ, భార్య కొన్న Gold విలువ రెండు లక్షలకు పెరిగింది. భారతీయ మహిళలు తమ ఆర్థిక నిర్ణయాల్లో ఎంత క్లారిటీతో, ఎంత దీర్ఘకాల దృష్టితో వ్యవహరిస్తారో అనేది ఇవి స్పష్టంగా చూపిస్తున్నాయి.
మందన్ చేసిన ఈ పోస్ట్ X (మాజీ ట్విట్టర్) లో లక్షలాదిగా వీక్షణలను దక్కించుకుంది. అనేక మంది వినియోగదారులు ఆయన భార్య ఆలోచనను ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. కొందరు భారతీయ మహిళలు తమ సంప్రదాయాలు, అనుభవం, దూరదృష్టిని పెట్టుబడుల రూపంలో అద్భుతంగా అమలు చేస్తారని అన్నారు. మరోవైపు కొన్ని కామెంట్లు జీవితం అంతా పొదుపుల గురించే కాకుండా, అనుభవాలు, ప్రయాణాలు కూడా అవసరమని గుర్తు చేశాయి.
బంగారంలో పెట్టుబడి మంచి లాభాలను ఇస్తుందనేది నిజమే అయినప్పటికీ, కారు ఇచ్చే సౌకర్యం, ప్రయాణాలు ఇచ్చే జ్ఞాపకాలు కూడా జీవితంలో దక్కే విలువైన సంపదలేనని కొందరు పేర్కొన్నారు. మొత్తానికి ఈ పోస్ట్ మిశ్రమ అభిప్రాయాలను దక్కించుకుందని చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications