బంగారం ధరల పెరుగుదలపై నిపుణులు కీలక హెచ్చరిక.. ఈ స్థాయికి పడిన వెంటనే కొనేయాలని సూచన..
ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మళ్లీ ఆందోళనకర స్థాయికి మారే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ సుంకాలకు అమెరికా సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేయడంతో అగ్రరాజ్యం అధ్యక్షుడి తదుపరి చర్యలను ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అమెరికా అత్యున్నత న్యాయస్థానం సుంకాల మీద ఇచ్చిన తీర్పుతో డాలర్ ఢమాల్ అయింది. దీంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సేఫ్ హెవెన్ బంగారం మీదకు మళ్ళించారు. దీంతో పసిడి ధరలు ఈ రోజు ఒక్కసారిగా ఎగబాకాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ బంగారం ధరల మార్పులపై నిపుణులు కీలక అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్ ఫారెక్స్ & కమోడిటీస్ హెడ్ అభిలాష్ కోయిక్కర సూచనల ప్రకారం.. బంగారం తిరిగి పైకి ర్యాలీ చేయడానికి బలమైన సాంకేతిక మద్దతు కొనసాగుతోందని కనిపిస్తోంది. ఆయన ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర త్వరలో రూ.1,63,000కి చేరే అవకాశం ఉంది, ఇది ఇటీవల MCX వద్ద నమోదైన ధరల స్థిరీకరణ, ట్రెండ్ లైన్ మద్దతుతో బలపడుతుంది. వారం వారం చార్ట్‌లలో బంగారం ధర గత గరిష్ట స్థాయిల నుండి కొంచెం తగ్గి, ఇప్పుడు కన్సాలిడేషన్ దశలో ఉంది.

ఈ స్థిరమైన మద్దతు పరిధిలో ఏదైనా తాత్కాలిక పతనం కొనుగోలుదారులను ఆకర్షించి.. మరింత బుల్లిష్ ముమెంటం సృష్టించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా రూ. 147,000 స్థాయి కీలకమైన మద్దతుగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ స్థాయి కంటే దిగువలో ముగింపు వస్తే తాత్కాలిక దిద్దుబాటు జరగవచ్చు. కానీ దాని పైన ఉండేంతవరకు బంగారం విస్తృత బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందని సూచిస్తున్నారు.
MCX Trading Strategy Summary:
Gold CMP: RS. 1,52,800 (ప్రస్తుత ధర)
Target: Rs. 1,63,000 (కొనుగోలు ఆపే స్థాయి)
Stop Loss: Rs. 1,47,000 (కొనుగోలుకు రెడీ అయ్యే స్థాయి)
Silver CMP: RS. 237,000 (ప్రస్తుత ధర)
Target:RS. 260,000 (కొనుగోలు ఆపే స్థాయి)
Stop Loss: Rs. 225,000 (కొనుగోలుకు రెడీ అయ్యే స్థాయి)
MCX బంగారం వ్యూహం ప్రకారం.. ప్రస్తుత ధర రూ. 152,800 వద్ద ఉంది. లక్ష్యం రూ. 163,000గా ఉంది, స్టాప్ లాస్ 147,000 వద్ద పెట్టారు. నిపుణులు సూచిస్తున్నట్లుగా.. మద్దతు జోన్‌లలో స్థిరంగా ఉండటం, సానుకూల మొమెంటం సూచికలున్నప్పుడు కొనుగోలు అవకాశాలు కొనసాగుతాయి. వారపు కన్సాలిడేషన్ పరిధిలో స్థిరమైన ధర చర్య బుల్లిష్ పునరుద్ధరణకు గేట్‌మెటల్‌గా పనిచేస్తుంది.
ఇక వెండి పరిస్థితిని పరిశీలిస్తే.. వెండి మూడు వారాలుగా తన మద్దతును సుస్థిరంగా కొనసాగిస్తోంది. ఈ కాలంలో, సైడ్-టు-పాజిటివ్ బయాస్ కొనసాగుతోంది. మునుపటి కనిష్ట స్థాయి కంటే పైగా ధరలు కొనసాగితే.. చిన్న పుల్‌బ్యాక్‌లు కూడా కొనుగోలుకు అవకాశం ఇస్తాయి. ప్రస్తుత ధర రూ. 237,000 వద్ద ఉంది. లక్ష్యం రూ. 2,60,000, స్టాప్ లాస్ రూ. 2,25,000గా సూచిస్తున్నారు.రూ. 2,25,000 మద్దతు జోన్ కంటే దిగువలో కఠిన ముగింపు వస్తే సానుకూల ట్రెండ్ కొంచెం చెరగవచ్చు. అయితే మద్దతు నుంచి తిరిగి పుంజుకోవడం బుల్లిష్ ర్యాలీ కొనసాగింపుకు దారితీస్తుంది.
నిపుణుల అంచనాల ప్రకారం.. బంగారం ధర రాబోయే సెషన్లలో రూ. 163,000 స్థాయిని చేరుకునే అవకాశం ఉంది. వెండి కూడా రూ. 2,60,000 దగ్గర తన ర్యాలీ కొనసాగించగలదు. ఈ పరిస్థితులు మార్కెట్‌లో సానుకూల సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తాయి, అలాగే ఖచ్చితమైన మద్దతు స్థాయిలలో కొనుగోలు ఆసక్తిని పెంచి.. బుల్లిష్ ట్రెండ్‌ను నిరంతరం కొనసాగించగలవని సూచిస్తున్నారు.
ఏదేమైనా స్థిరమైన మద్దతు, సాంకేతిక సూచికల బలము, సానుకూల మార్కెట్ సెంటిమెంట్ బంగారం-వెండి ధరలపై అధిక స్థాయి ర్యాలీ అవకాశాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వివరాలను పరిగణలోకి తీసుకుంటే.. పెట్టుబడిదారులు స్థిరమైన మద్దతు ప్రాంతాల్లో ఎంట్రీ తీసుకోవడం మరియు ట్రెండ్‌పై దృష్టి పెట్టడం అత్యంత సుక్ష్మ వ్యూహంగా భావించవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications