భారతీయులకు బంగారానికి విడదీయలేని సంబంధం ఉంటుంది. తరతరాలుగా మన వారు బంగారాన్ని స్వయానా లక్ష్మీ దేవిలా చూస్తారు. కేవలం ఆభరణాల కోసమే కాకుండా... ఆపత్కాలంలో ఆదుకునే అద్భుతమైన ఆర్థిక సాధనంగా కూడా బంగారమే ముందు వరుసలో ఉంటుంది. ఎంత పేదవాడైనా ... ఇంటిలో 10-20 గ్రాముల బంగారమైనా ఉండి తీరుతుంది. పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, పేరంటాలప్పుడు తప్పనిసరిగా కొనుగోలు చేసేది కూడా బంగారమే.
అందుకే, ప్రపంచంలోనే బంగారం వినియోగంలో భారత దేశం ముందు ఉంటుంది. ప్రతి ఏటా వందల టన్నుల బంగారం దిగుమతి చేసుకునేది కూడా అందుకే. అయితే, మాయదారి మహమ్మారి కరోనా వైరస్ మన దేశం పైనా దాని ప్రతాపం చూపుతోంది కాబట్టి, దేశం మొత్తం 40 రోజులుగా లాక్ డౌన్ లో ఉంది కాబట్టి అందరికీ ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. చేద్దామంటే పనిలేదు... జేబులో చిల్లి గవ్వ లేదు. ఇదీ ప్రస్తుతం కోట్ల మంది భారతీయుల దీనస్థితి. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత మళ్ళీ బతుకు జట్కా బండి సవ్యంగా సాగాలంటే చేతిలో కొంత ధనం ఉంది తీరాల్సిందే. ఈ విపత్తు సమయంలో బంగారం ఒక్కటే మన వారిని కాపాడగలదని చెప్పొచ్చు.

పెరగనున్న తనఖా...
అప్పు పుట్టాలంటే ఏదో ఒక సెక్యూరిటీ పెట్టవలసిందే. అతి వేగంగా, నిమిషాల్లో అప్పు దొరికేది బంగారం తనఖా పెట్టినప్పుడే. బ్యాంకుల నుంచి ఫైనాన్స్ సంస్థల వరకు, మార్వాడి కొట్టు నుంచి, ఇంటి పక్కన షావుకారు వరకు ఎవరైనా సరే బంగారాన్ని తాకట్టు పెడితే దానిపై ఋణం వెంటనే ఇచ్చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయులకు అతి వేగంగా డబ్బులు చేతిలో లభించే సాధనం బంగారం మాత్రమే. అందుకే, లాక్ డౌన్ ముగియగానే... చాలా మంది బంగారం తనఖా షాపులకు పరుగులు తీస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. స్వల్పకాలిక రుణాలు తీసుకుని, తమ తమ కార్యకలాపాలు పట్టాలెక్కిస్తారని చెబుతున్నారు. కొందరైతే ఏకంగా బంగారాన్ని విక్రయించడానికి కూడా వెనుకాడరని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే, ఇప్పుడు బంగారంపై ఋణం తీసుకుని, దాన్ని వడ్డీ తో సహా తిరిగి చెల్లించే స్థోమత తగ్గిపోవటమే దానికి కారణం అని వివరిస్తున్నారు. అందుకే బంగారం తనఖా లేదా పాత బంగారం విక్రయాలు పెరుగుతాయని అంచనా.

పెరిగిన ధరలు...
గత కొంత కాలంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర సుమారు రూ 30,000 పలికేది. ప్రస్తుతం అదే 10 గ్రాముల బంగారం ధర రూ 43,000 కు చేరుకుంది. ధరలు మరింతగా పెరుగుతాయని మార్కెట్ అంచనాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న తరుణం లో ఇన్వెస్టర్లు బంగారం లోనే పెట్టుబడులు పెడుతుండటంతో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అయితే, ఈ పెరిగిన ధరలు ఒకరకంగా మన వారికి మేలు చేసేవే. ఎందుకంటే... ఏడాది క్రితం ఒక 10 గ్రాముల బంగారం తనఖా పెడితే రూ 20,000 వరకు ఋణం లభించేది. కానీ, ఇప్పుడు అదే బంగారానికి రూ 30,000 నుంచి 35,000 వరకు ఋణం లభిస్తుంది. దీంతో, తమ తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు బంగారం తనఖా ఒక చక్కని మార్గంగా కనిపిస్తోంది. బ్యాంకులైతే వడ్డీ రేట్లు తక్కువగా వసూలు చేస్తాయి. కానీ గోల్డ్ లోన్ సంస్థలైతే 24% వడ్డీ పిండుతాయి. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలి.

800 తన్నులు...
బంగారం పై భారతీయులకు ఉన్న మక్కువ వల్ల మన దేశంలో ప్రతి ఏటా పెద్ద ఎత్తున బంగారం క్రయ విక్రయాలు సాగుతాయి. మన దేశంలో ఉన్న డిమాండ్ కు తగినంత బంగారం దేశీయంగా లభించటం లేదు. అందుకనే మనం ప్రతి సంవత్సరం సుమారు 700 టన్నుల నుంచి 800 టన్నుల వరకు బంగాన్ని దిగుమతి చేసుకుంటాం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం ఈ ఏడాది కూడా దిగుమతులు ఇదే స్థాయిలో ఉండనున్నాయి. అయితే, డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు మన దేశం సంవత్సరానికి 1,000 టన్నుల బంగారాన్ని కూడా దిగుమతి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సెల్ అంచనా ప్రకారం మన దేశంలోని ప్రజలందరి దగ్గర సుమారు 25,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికం కావటం విశేషం. మరే దేశంలోనూ ఇంత భారీ స్థాయిలో బంగారం ప్రజల వద్ద లేదు. ఎంతైనా బంగారం బంగారమే కదా!
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications