Gold Rates: గడచిన కొన్ని రోజులుగా అమెరికా మార్కెట్ల ప్రభావం వల్ల గోల్డ్ రేట్లు కొంత పతనమౌతున్నాయి. అయితే ఈ ఆనందం ఎక్కువ కాలం ఉండదని తెలుస్తోంది. పసిడి ప్రియులకు ఇది తప్పకుండా చేదువార్త అని చేప్పుకోవాలి.

బయపెట్టనున్న బంగారం..
వచ్చే ఏడాది బంగారం ధరలు రూ.60,000 చేరుకోవచ్చని మైనింగ్ అనుభవజ్ఞులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం పెరిగినందున వచ్చే ఏడాది బంగారం ఔన్సుకు 2,000 డాలర్ల కంటే ఎక్కువకు ర్యాలీ అవుతుందని నిపుణులు అంటున్నారు. ధరల ఒత్తిళ్లను తట్టుకునే సాంప్రదాయ హెడ్జింగ్ పెట్టుబడిగా పరిగణించే గోల్డ్ తీవ్రంగా ప్రభావితం కానుందని తెలుస్తోంది.

గోల్డ్ రేట్లపై ఫెడ్ ఎఫెక్ట్..
రానున్న కాలంలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంపుదల వాయిదా వేయవచ్చు లేదా తక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. ద్రవ్యోల్బణ ప్రభావం ఎక్కువ కాలం ఉండేందుకు మార్కెట్ అలవాటు పడవలసి ఉంటుందని ఆస్ట్రేలియా ఎవల్యూషన్ మైనింగ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జేక్ క్లైన్ బ్లూమ్‌బెర్గ్‌తో అన్నారు. ఇది బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రాబడులను ఇవ్వనుంది. ప్రస్తుతం ఔన్స్‌కు స్పాట్ బులియన్ 1,765 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గతంలో ఆగస్టు 2020లో ధరలు రికార్డు స్థాయిలో ఔన్స్‌కు 2,075.47 డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది కూడా ఆ స్థాయికి చేరుకున్నాయి.

భారీగా పెరిగిన బంగారం డిమాండ్..
2023 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిని 12.5% పెంచి 720,000 ఔన్సులకు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం దీనిని 11% పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ఇదే సమయంలో కరోనావైరస్ మహమ్మారి తెచ్చిన ఆర్థిక మాంద్యం తరువాత భారత్ లో బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. గోల్డ్ డిమాండ్ గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 43 శాతం పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక వెల్లడించింది.

2022లో డిమాండ్..
భారత్ లో 2022, రెండవ క్వార్టర్ లో గోల్డ్ డిమాండ్ విలువ రూ.79,270 కోట్లుగా ఉంది. ఈ విలువ 2021 రెండవ క్వార్టర్ లో రూ.51,540 కోట్లుగా ఉంది. అంటే విలువలో దాదాపు 54 శాతం పెరిగింది. Q2 2021లో 94 టన్నుల డిమాండ్ ఉండగా.. Q2 2022కి భారతదేశంలో మొత్తం ఆభరణాల డిమాండ్ 49 శాతం పెరిగి 140.3 టన్నులకు చేరుకుంది. రెండవ త్రైమాసికంలో భారత బంగారం డిమాండ్ 43% పెరిగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.


Click it and Unblock the Notifications