రీసెంట్ గా చైనాలో అతి పెద్ద బంగారు గని(Gold Mines) బయటపడింది. చైనాలోని తూర్పు లియానింగ్ ప్రావిన్స్‌లోని ప్రాంతంలో ఈ గని బయటపడినట్టు చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది చైనాలోనే అతి పెద్ద బంగారు గని అని నిపుణులు చెప్తున్నారు. దీని గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చైనాలోని తూర్పు లియానింగ్ ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతం వద్ద భారీగా గోల్డ్ రిజర్వు ఉన్నట్టు చైనా ప్రభుత్వం గుర్తించింది. మైనింగ్ నిపుణులు చేసిన సర్వే ప్రకారం ఆ ప్రాంతంలో సుమారు వెయ్యి టన్నులకుపైగా స్వచ్ఛమైన బంగారు నిల్వలు ఉండొచ్చని ఒక అంచనా. అంతేకాదు ఇది చైనా చరిత్రలోనే అత్యంత భారీ గోల్డ్ రిజర్వు అని నిపుణులు చెప్తున్నారు. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ స్థాపించబడినప్పటి నుండి దేశంలో నమోదైన అతిపెద్ద బంగారు గని ఇదే. చైనాలో ఇలాంటి భారీ గోల్డ్ మైన్స్ లభించడం ఇది మూడోసారి.
మొత్తం విలువ ఎంతంటే..
గతంలో చైనా ప్రభుత్వం తమ భూగర్భంలో కేవలం 3 వేల టన్నుల బంగారు గనులు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు అంచనా వేసింది. కానీ వరుసగా బయటపడుతున్న కొత్త నిధులు అంచనాలను తారుమారు అవుతున్నాయి. తాజాగా లభించిన గనిలో 2.586 మిలియన్ టన్నుల ఖనిజం ఉన్నట్టు తేలింది. ఇది దాదాపు 1,444 టన్నుల బంగారం అని అధికారులు చెప్తున్నారు. ఈ గోల్డ్ మైన్ ను కనుగొనే ప్రాజెక్టును ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లియోనింగ్ జియోలాజికల్ అండ్ మైనింగ్ గ్రూప్ చేపట్టింది. సుమారు వెయ్యి మంది సాంకేతిక నిపుణులు, కార్మికులతో ఏడాది పాటు అన్వేషణ చేసి ఈ గోల్డ్ మైన్ ను కనుగొన్నారు
ఎకానమీకి బూస్ట్
చైనాలో లభించిన ఈ బంగారు నిల్వల కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనా అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఎక్విప్ మెంట్ తోపాటు, ఏఐ బాట్స్, రాడార్ సిస్టమ్స్, మినరల్ శాటిలైట్ల వంటి టెక్నాలజీలపై దృష్టి పెట్టింది. దీంతోపాటు చైనా దగ్గర అరుదైన ఖనిజాలు ఎలాగూ ఉన్నాయి. ఈ సమయంలో బంగారు నిల్వలు లభించడం చైనా ఎకానమీకి మరింత బూస్ట్ నిస్తుంది.
పెరుగుతున్న డిమాండ్
ఇటీవలి కాలంలో చైనా తన ఖనిజ అన్వేషణలను వేగవంతం చేసింది. 2024లో, హునాన్ ప్రావిన్స్‌లో 1,000 టన్నులకు పైగా గోల్డ్ మైన్ దొరికింది. అక్టోబర్‌లో మరో 40 టన్నుల మైన్ కనుగొన్నారు. ఒక్క 2024లోనే చైనా 377.24 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. బంగారానికి డిమాండ్ పెరుగుతున్న ఈ సమయంలో చైనాకు ఇది జాక్ పాట్ అనే చెప్పాలి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా రీసెంట్ టైమ్స్ లో బంగారం ధరలతో పాటు బంగారం డిమాండ్ కూడా విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బంగారు గనుల వంటివి దేశాల ఆర్ధిక వ్యవస్థకు బలమైన సపోర్ట్ అందిస్తాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications