బంగారం కొంటే ఇప్పుడే కొనండి..2026 నాటికి రూ. 3.47 లక్షలకు చేరబోతోంది, ఫిడెలిటీ వార్నింగ్ బెల్ చూడండి..

పసిడి ధరలు ప్రస్తుతం లక్షరూపాయల వద్ద ఊగిసలాడుతున్నాయి. అయితే భవిష్యత్తులో బంగారం పెరుగుదలపై షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బంగారం ధరలు వచ్చే సంవత్సరం చివరినాటికి ఔన్సుకు 4 వేల డాలర్లకు చేరుకుంటాయని ఫిడెలిటీ ఇంటర్నేషనల్ అంచనా వేసింది. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.3.47 లక్షలు. దీనికి అనేక కారణాలను ఫిడెలిటీ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పలు ఆర్థిక, రాజకీయ అంశాలు భవిష్యత్తులో బంగారం పెరుగుదలకు కారణమవుతాయని తేల్చి చెప్పింది.

ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలు, బలహీనమైన డాలర్, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల బంగారం నిల్వల పెరుగుదల వంటి అంశాలు బంగారం ధరలను భవిష్యత్తులో విపరీతంగా ప్రభావితం చేస్తాయని Fidelity అంచనా వేసింది. బంగారం ధరలు ఈ ఏడాది మనం చూసుకున్నట్లయితే.. స్పాట్ గోల్డ్ ధరలు 25 శాతానికి పైగా పెరిగాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయాలు బంగారం ధరలను విపరీతంగా ప్రభావితం చేశాయి.

gold price 2026 gold to 3 47 lakh Fidelity gold forecast gold price prediction India Rs 3 47 lakh gold by 2026 gold investment future gold vs inflation gold bull run 2026 gold target Fidelity gold price catalysts gold 4000 2026 gold India forecast bullion price rise 2026 3 47 2026 vs 2026 3 5 2026

ట్రంప్ తీసుకున్న అనిశ్చిత వాణిజ్య విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని కలిగించాయి. ఈ నేపథ్యంలోనే బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు పెట్టుబడిదారులు తరలిపోయారు. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా చుక్కలను తాకాయి. సామాన్యులకు అందకుండా పోయిందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.

ఫిడెలిటీ సంస్థ తెలిపినట్లుగా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఫెడరల్ రిజర్వ్ విధానాల్లో మార్పు (వడ్డీ రేట్లు తగ్గించే దిశగా చర్యలు) బంగారం ధరలను భారీగానే ప్రభావితం చేశాయి. డాలర్ విలువ తగ్గడంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత డిమాండ్ గా భావించారు. ఇక కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు కూడా మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరిగేలా చేస్తున్నాయి. బలహీనమైన డాలర్ కారణంగా ఇతర దేశాలకు బంగారం కొనుగోలు చేయడం తక్కువ ఖర్చుతో ఉండటంతో పసిడి డిమాండ్ పెరుగుతుంది.

ఫిడెలిటీ మల్టీ-ఆస్తి నిధి నిర్వాహకుడు ఇయాన్ సామ్సన్ తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని నిధులు ఇప్పటికే బంగారంపై పెట్టుబడి కేటాయింపులను 5 శాతం నుంచి రెట్టింపు చేశాయి. ఇది Gold పట్ల ఉన్న విశ్వాసాన్ని చూపుతుంది. ఆగస్టు నెల మార్కెట్లకు సాధారణంగా అస్థిరంగా ఉండే సమయం కావడం వల్ల.. పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పెంచే ప్రయత్నంలో ఉన్నారని అభిప్రాయపడ్డారు.సామ్సన్ ప్రకారం చూసుకున్నట్లయితే.. అమెరికాలోని వాణిజ్య ఒప్పందాలు "డూమ్స్‌డే" (ఆర్థిక సంక్షోభ) పరిస్థితిని కొంతవరకు నివారించాయి.

ఇదే సమయంలొ తక్కువ వృద్ధి, పన్నుల భారాలు,ఫెడరల్ రిజర్వ్ లో దూకుడు విధానాలు కొనసాగితే ఆ ప్రభావం అమెరికా డాలర్ పై పడే అవకాశం ఉంది. అది బలహీనపడితే అంతర్జాతీయంగా Gold పెట్టుబడులపై పడే అవకాశముంది. ఏదేమైనా ఫిడెలిటీ అంచనా ప్రకారం 2026 నాటికి బంగారం ధరలు రూ. 3 లక్షలు దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెట్టుబడిదారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని తమ ప్రణాళికలు వేసుకోవాలని సూచిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+