భవిష్యత్తులో బంగారం ధర తులం రూ. 15 లక్షలకు.. సామాన్యుల పసిడి ఆశలపై బాంబు పేల్చిన బిలియనీర్ థామస్ కాప్లాన్ ..

అంతర్జాతీయ మార్కెట్లలో Gold ధరల భవిష్యత్తుపై ప్రపంచ ప్రసిద్ధ బిలియనీర్.. ఎలెక్ట్రమ్ గ్రూప్ (Electrum Group) చైర్మన్ థామస్ కాప్లాన్ (Thomas Kaplan) చేసిన అంచనాలు ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒక ట్రాయ్ ఔన్స్ (Troy Ounce) బంగారం ధర సుమారు 4,600 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

అయితే రాబోయే రోజుల్లో ఈ పసుపు లోహం ధర ప్రస్తుత స్థాయి నుండి పది రెట్లకు పైగా పెరిగి ఔన్సుకు 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల స్థాయిని అందుకోవడం కేవలం సాధ్యం మాత్రమే కాదని.. అది 'అనివార్యం' (Inevitable) అని కాప్లాన్ విశ్లేషించారు. ఈ అంచనాను భారతీయ మార్కెట్ కోణంలో పరిశీలిస్తే.. ఔన్సుకు 50,000 డాలర్ల ధరను, అమెరికన్ డాలర్‌తో రూపాయి మార్పిడి విలువను సగటున రూ. 95గా లెక్కలోకి తీసుకుంటే.. భారతదేశంలో 10 గ్రాముల Gold ధర సుమారు రూ. 15 లక్షలకు చేరే అవకాశం ఉంటుంది.

Thomas Kaplan gold prediction gold price 50000 gold price forecast 2026 15 lakh gold price gold price prediction India gold tenfold rise gold investment Electrum Group gold rally gold price outlook billionaire investor prediction gold correction precious metals gold market news 50 000 2026 15 10

2025లో సరికొత్త చారిత్రక గరిష్టాలను తాకిన బంగారం ధరలు, గత కొన్ని నెలలుగా కొంత దిద్దుబాటుకు (Correction) లోనయ్యాయి. దీంతో పసిడి 'బుల్ రన్' ముగిసిపోయిందా అనే ఆందోళన ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతోంది. ఈ తిరోగమనంపై స్పందించిన కాప్లాన్.. దీనిని 1987లో సంభవించిన 'బ్లాక్ మండే' సంక్షోభంతో పోల్చారు. 1987 ఆగస్టులో డౌ జోన్స్ ఇండెక్స్ 2,722 పాయింట్ల గరిష్ట స్థాయి నుండి అక్టోబర్ నాటికి 1,738 పాయింట్లకు (సుమారు 36 శాతం పతనం) పడిపోయింది. ఆ సమయంలో ఈ పతనం విపత్కరంగా అనిపించినప్పటికీ.. గత 45 సంవత్సరాల సుదీర్ఘ చార్ట్‌ను పరిశీలిస్తే ఆ కుదేలు గ్రాఫ్‌లో చిన్న మార్పులా కూడా స్పష్టంగా కనిపించదు.

Also Read

అలాగే, ప్రస్తుత బంగారం ధరల క్షీణత కూడా ఒక మౌలికమైన సమస్య కాదని.. సుదీర్ఘమైన బుల్ మార్కెట్‌లో వచ్చే స్వల్పకాలిక వ్యత్యాసం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇది ఇన్వెస్టర్లకు భయపడాల్సిన సమయం కాదని, ఒక అద్భుతమైన కొనుగోలు అవకాశమని పేర్కొన్నారు. అయితే ఈ 50,000 డాలర్ల ధరల మార్కు ఎప్పుడు సాధ్యమవుతుందనే దానిపై కాప్లాన్ ఎటువంటి నిర్దిష్ట కాలక్రమాన్ని (Timeframe) వెల్లడించలేదు. స్వల్పకాలిక కదలికల కంటే మధ్యస్థ, దీర్ఘకాలిక పరిణామాలే ప్రాధాన్యత వహిస్తాయని ఆయన విశ్వసిస్తున్నారు.

కాప్లాన్ మాత్రమే కాకుండా.. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి, ప్రముఖ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్ వంటి విశ్లేషకులు సైతం బంగారం, వెండి ధరల దీర్ఘకాలిక పెరుగుదలపై సానుకూల దృక్పథంతో ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితులు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు దీర్ఘకాలంలో లోహాలకు బలమైన మద్దతుగా నిలుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+