గత వారం మార్కెట్‌లో బంగారం ధరలో పడిపోయాయి. లక్షకు చేరిన బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే పసిడి ధరలు 1 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ (COMEX Gold Futures) ఆగస్టు డెలివరీ ఒప్పందం కింద ఔన్సు ధర 37.90 డాలర్లు తగ్గి 3,335.60 డాలర్ల వద్ద స్థిరపడింది. మార్కెట్ నిపుణులు దీన్ని చాలా కీలక సంకేతంగా పరిగణిస్తున్నారు.
పెట్టుబడిదారుల దృష్టి అంతా ప్రస్తుతం యుఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశంపై ఉంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం Gold ధరను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికి తోడు అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలు.. ప్రపంచ వాణిజ్య ఒప్పందాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా Gold మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.

వెంచురా కమోడిటీ & CRM విభాగం అధిపతి ఎన్.ఎస్. రామస్వామి మాట్లాడుతూ.. అమెరికా-చైనా మధ్య సుంకాల సస్పెన్షన్ కాలం ఆగస్టు 1తో ముగియనుంది. దీంతో పసిడి మీద ఒత్తిడి పెరుగుతోంది. గత వారంలో బంగారం ధర USD 3,438 నుండి USD 3,335కి పడిపోవడం ఉదాహరణగా చూడవచ్చన్నారు. రాబోయే రోజుల్లో ఏదైనా సుంకాల పొడిగింపు లేదా కొత్త ఒప్పందాలు రాకపోతే బంగారం ధరలు మరింతగా తగ్గి సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
పెట్టుబడిదారులలో ప్రస్తుతం బంగారంపై ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోంది. వాళ్లు సురక్షితం కాదనే అభిప్రాయంలో ఉన్నట్లుగా ఆయన చెబుతున్నారు. దీనికి కారణం ఏంటంటే..అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కంపెనీలు చూపిస్తున్న బలమైన లాభాలతో పెట్టుబడి దారులు అటువైపు వెళుతున్నారు. దీనికి తోడు స్టాక్ మార్కెట్లలో పెరుగుతున్న ఆసక్తి, ట్రెజరీ బాండ్ల దిగుబడులు పెరగడం వంటి అంశాలు కూడా పెట్టుబడిదారులు బంగారాన్నివదిలి వేయడానికి కారణమవుతున్నాయని రామస్వామి చెబుతున్నారు.
ఇంకా ఆందోళనకర అంశం ఏంటంటే.. ఫెడరల్ రిజర్వ్ దృష్టికోణం గట్టిగా ఉండబోతుందా? లేదా అమెరికా-చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమవుతాయా? అనే అంశాలు కూడా ఆగస్టు నెలలో బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి, ఆగస్టు 1 వాణిజ్య గడువు చివరగా నిలిచే సందర్భంలో బంగారం మరింత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాబట్టి బంగారంపై పెట్టుబడి పెట్టే వారు మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని రామస్వామి సూచిస్తున్నారు.
సరైన సమయం కోసం వేచి చూడటం లేదా తక్కువ సమయంలో లాభాల కోసం మార్కెట్‌లోకి వెళ్లవవద్దని సలహా ఇస్తున్నారు. వాణిజ్య పరమైన స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే బంగారం ధరల్లో స్థిరత్వం వస్తుంది కాబట్టి అప్పటివరకు వేచి ఉండాలని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications