యుఎస్-ఇరాన్ యుద్ధంతో ఆర్థిక మాంద్యం ముప్పు... బంగారాన్ని భారీగా కొని దాచిపెట్టుకుంటున్నకేంద్ర బ్యాంకులు..

అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ద వాతవరణ తీవ్రత సమీప భవిష్యత్తులోనూ బంగారం ధరలపై తన ప్రభావాన్ని బలంగా చూపుతుందని షేర్‌ఖాన్ సంస్థ కరెన్సీలు, కమోడిటీస్ విభాగాధిపతి ప్రవీణ్ సింగ్ విశ్లేషించారు. హార్ముజ్ జలసంధి నియంత్రణ విషయంలో ఇరు దేశాల మధ్య దాడులు పెరగడం.. చమురు సరఫరాలకు ఆటంకాలు కలగడం మార్కెట్లను తీవ్రంగా కుదిపేస్తోంది.

ఇరాన్ జలసంధి గుండా వెళ్లే నౌకలను నిరోధించడంతో పాటు రవాణా అయ్యే సరుకులపై 20 శాతం భారీ సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ఒక్కసారిగా 4 శాతానికి పైగా పెరిగాయి. ఈ చమురు ధరల పెరుగుదల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ ఆందోళనలను మళ్లీ రేకెత్తించడమే కాకుండా.. వారం ప్రారంభంలో స్పాట్ గోల్డ్ 2.6 శాతం భారీ రోజువారీ నష్టంతో 4,013 డాలర్ల వద్ద ట్రేడయ్యేలా తీవ్రమైన ఒత్తిడిని పెంచింది.

Gold Price Prediction Gold Outlook Next Week Gold Prices Gold Rates Gold Price Forecast Bullion Market Federal Reserve US Dollar Index Bond Yields Gold Market Precious Metals Gold Investment Business News

చమురు మార్కెట్లో తలెత్తిన ఈ సరఫరా ఆందోళనల కారణంగా డాలర్ ఇండెక్స్ 0.15 శాతం పెరిగి 101.11 వద్దకు చేరగా.. అమెరికా బాండ్ రాబడులు కూడా గరిష్ట స్థాయిలను తాకాయి. రెండు సంవత్సరాల ట్రెజరీ రాబడులు 4.25 శాతానికి.. పది సంవత్సరాల రాబడులు 4.60 శాతానికి పెరగడం పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులో కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచవలసి వస్తుందని ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా ఫెడ్ పర్యవేక్షణ వైస్ చైర్ మిషెల్ బోమన్ అంతర్జాతీయ పర్యవేక్షణలో కఠిన నిబంధనలకు బదులు ఫ్లెక్సిబిలిటీ ఉండాలని అభిప్రాయపడ్డారు. మార్కెట్ వర్గాలన్నీ ఇప్పుడు నూతన ఫెడ్ ఛైర్ కెవిన్ వార్ష్ కాంగ్రెస్ కమిటీల ముందు ఇవ్వనున్న ద్రవ్య విధాన నివేదిక సాక్ష్యంపై.. రాబోయే అమెరికా జూన్ సీపీఐ, పీపీఐ ద్రవ్యోల్బణ డేటాపై నిశితంగా దృష్టి పెట్టాయి.

Also Read

ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితిని తట్టుకోవడానికి ప్రపంచవ్యాప్త కేంద్ర బ్యాంకులు తమ వైవిధ్యీకరణ వ్యూహంలో భాగంగా బంగారం కొనుగోళ్లను భారీగా పెంచుకుంటూ పోతున్నాయి. చైనా కేంద్ర బ్యాంకు జూన్ నెలలో తన నిల్వలకు మరో 15 టన్నుల బంగారాన్ని జోడించి వరుసగా 20వ నెలలోనూ కొనుగోళ్ల జోరును నిలబెట్టుకుంది. అలాగే మే నెలలో వివిధ కేంద్ర బ్యాంకులు మొత్తం 41 టన్నుల బంగారాన్ని తమ ఖాతాలో వేసుకోగా.. పోలాండ్ నేషనల్ బ్యాంక్ ఏకంగా 82 టన్నుల బంగారాన్ని పోగుచేసింది.

అయితే ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో మార్పుల వల్ల కామెక్స్ (COMEX) లో Gold నిల్వలు 14.76 మిలియన్ ఔన్సుల మార్కుతో అక్టోబర్ 2024 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అలాగే జూలై 7తో ముగిసిన వారానికిCFTC నివేదిక ప్రకారం.. మనీ మేనేజర్లు తమ బుల్లిష్ గోల్డ్ బెట్స్‌ను 1,963 నెట్-లాంగ్ పొజిషన్లు తగ్గించుకుని 114,854కు పరిమితం చేసుకున్నారు.

రాబోయే రోజుల్లో అమెరికా నుండి వెలువడనున్న వీక్లీ ఏడీపీ ఉపాధి మార్పు, సీపీఐ, పీపీఐ, రిటైల్ అమ్మకాల డేటాతో పాటు, చైనాకు చెందిన జీడీపీ, వాణిజ్య బ్యాలెన్స్, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు మార్కెట్ దిశను స్పష్టం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం స్వల్పకాలిక గమనం పూర్తిగా ఇరాన్ వివాదపు వార్తలపైనే ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ చమురు ధరలు మరింత పెరిగితే తీవ్రమైన ఒడిదుడుకుల నడుమ పసిడి ధర 3,930 నుండి 3,850 డాలర్ల స్థాయి వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఉద్రిక్తతలు తగ్గి డేటా సానుకూలంగా వస్తే.. ఈ లోహం 4,095 నుండి 4,120 డాలర్ల నిరోధక స్థాయిని పరీక్షించే అవకాశం ఉన్నప్పటికీ.. మార్కెట్లో పూర్తి బుల్లిష్ ట్రెండ్ రావాలంటే మాత్రం 4,200 డాలర్ల బలమైన నిరోధక మార్కును విజయవంతంగా దాటాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+