Gold Rates: దేశంలో బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పడిపోతున్నాయి. అయితే రేట్లు తగ్గుతున్నప్పటికీ డిమాండ్ మాత్రం పెరగటం లేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
గత కొన్ని రోజులుగా పడిపోతున్న పసిడి రేట్లు నేడు సైతం అదే ధోరణిని కొనసాగించాయి. ఈ క్రమంలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర దేశంలో సగటున రూ.200 తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే చెన్నైలో రూ.54,370, ముంబైలో రూ.53,850, దిల్లీలో రూ.54,000, కలకత్తాలో రూ.53,850, బెంగళూరులో రూ.53,850, వడోదరలో రూ.53,900, జైపూర్ లో రూ.54,000, మధురైలో రూ.54,370, పాట్నాలో రూ.53,900, నాశిక్ లో రూ.53,880గా ఉన్నాయి.

రేట్లు తగ్గుతున్నా విక్రయాలు పెరగకపోవటంపై బంగారం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆషాడమాసం ప్రారంభం కావటంతో పెళ్లిళ్లు కూడా లేకపోవటంతో బులియన్ మార్కెట్ కళతప్పింది. ప్రస్తుతం బంగారానికి సంబంధించి ఇన్సైడ్ ట్రేడింగ్ మాత్రమే ఎక్కువగా సాగుతుందని తెలుస్తోంది.
24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.210 మేర తగ్గింది. వివిధ నగరాల్లో తాజా రేట్లను పరిశీలిస్తే చెన్నైలో రూ.59,300, ముంబైలో రూ.58,750, దిల్లీలో రూ.58,900, కలకత్తాలో రూ.58,750, బెంగళూరులో రూ.58,750, వడోదరలో రూ.58,800, జైపూర్ లో రూ.58,900, మధురైలో రూ.59,300, పాట్నాలో రూ.58,800, నాశిక్ లో రూ.58,750గా కొనసాగుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మారిన తాజా ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, అనంతపురంలలో రూ.53,850గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,750గా కొనసాగుతోంది. తెలంగాణ నగరాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో కిలో వెండి ధర రూ.71,900గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications