One Nation One Gold Rate: భారతదేశంలో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే వాటిలో పసిడి ఎల్లప్పుడూ మెుదటి స్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. దశాబ్ధాలు మారిన పసిడిపై భారతీయుల తమ ప్రేమను అలాగే ఉంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజూ అంతర్జాతీయంగా రేట్లకు అనుగుణంగా దేశంలో మారుతున్న గోల్డ్ విక్రయ రేట్లను వాళ్లు ట్రాక్ చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో దేశంలోని ఒక్కో ప్రాంతంలో ధరలు వేరువేరుగా ఉంటున్నాయి. ఇది కొనుగోలుదారులను గందరగోళానికి గురిచేస్తోంది. వీటికి త్వరలోనే వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్ పాలసీ ద్వారా కేంద్రం చెక్ పెట్టాలని చూస్తోంది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద జువెలర్స్ అందరూ అంగీకరించారు. అలాగే ఇది పసిడి వ్యాపారంలో ట్రాన్పరెన్సీని పెంచుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పన్ను కాకుండా అనేక ఇతర అంశాలు ఉన్నందున పసిడి ధరలు రాష్ట్రం నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్(GJC) కూడా బంగారంపై ఒకటే ధరను తీసుకురావడానికి వన్ నేషన్ వన్ రేట్ విధానానికి మద్దతు ఇచ్చింది. సెప్టెంబర్ 2024లో జరిగే సమావేశంలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడవచ్చు. అయితే ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆభరణాల పరిశ్రమ సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తోందని సమాచారం. దీని లక్ష్యం దేశవ్యాప్తంగా బంగారం ధరలను ఏకరీతిగా మార్చటమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ విధానం అమలులోకి వస్తే.. ప్రజలు దేశంలోని ఏ మూలన బంగారాన్ని కొనుగోలు చేసినా ఒకటే ధర ఉండనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేస్తుంది.
వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్ పాలసీ ప్రయోజనాలు..
- ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల బంగారం ధరల్లో పారదర్శకత పెరుగుతుంది. దేశ వ్యాప్తంగా బంగారం ధర ఒకే విధంగా ఉంటూ ధరల వివక్ష తొలగిపోనుంది.
- కస్టమర్లందరికీ పసిడి వ్యాపారులు ఒకటే ధరకు గోల్డ్ విక్రయాలు చేపట్టాల్సి ఉంటుంది.
- ఈ నిర్ణయం బంగారం మార్కెట్‌ను పెంచుతుంది. ప్రజల్లో ధరలపై నమ్మకాన్ని పెంచి చర్చలను నిరోధిస్తుంది.
- ఈ విధానం వినియోగదారులు సరసమైన ధరకు బంగారాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే చిన్న పెద్ద ఆభరణాల విక్రయదారుల మధ్య సరసమైన పోటీని పెంచుతుంది.


Click it and Unblock the Notifications