పసిడి ప్రియులకు ముందు ముందు మంచి రోజులు వస్తున్నాయి. గత నెలలో నింగిని తాకిన బంగారం ధరలు ఈ నెలలో రోజు రొజుకు తగ్గుతూ వస్తున్నాయి. పెట్టుబడిదారులంతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 9న విధించబోయే కొత్త టారిఫ్ మీద దృష్టి సారించడంతో పసిడి తన వెలుగును కోల్పోయింది. ఈ రోజు MCX బంగారం ధర 0.5% పైగా తగ్గింది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో పసిడి ధరలు తగ్గుతూ ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన ఛాయలు కనిపించడం..అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒప్పందాలలో పురోగతి సాధించామనే ప్రకటన.. వెరసి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఈరోజు MCXలో బంగారం ధర 0.52 శాతం తగ్గి 10 గ్రాముల ధర రూ. 96,485 వద్ద కొనసాగుతోంది. నిన్న పసిడి ధర రూ.96,990గా నమోదైంది. నేడు ఉదయం 9:10 గంటల సమయానికి రూ. 96,500 వద్ద పసిడి ధర ట్రేడవుతోంది. వెండి ధర కూడా 0.38% తగ్గి రూ. 1,08,124 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయంగా, స్పాట్ గోల్డ్ ధరలు 0.6% తగ్గి ఔన్స్‌కు 3,314.21 డాలర్లకు కు చేరాయి. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా ఇదే శాతం తగ్గాయి. వెండి ధరలు 0.8% పడిపోయి ఔన్స్‌కు 36.81 డాలర్లుగా నమోదయ్యాయి.

అమెరికాలో ఆగస్ట్ 1 నుంచి ట్రంప్ విధించిన అధిక టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి.అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే 10% ప్రాథమిక టారిఫ్‌ను అమలు చేశారు. అయితే ఎక్కువ దేశాలకు ఈ టారిఫ్ అమలు తేదీని వాయిదా వేశారు. ట్రేడింగ్ ఎకనామిక్స్ నివేదిక ప్రకారం.. అమెరికా ఇప్పటికీ అనేక బహుళ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసే దశలో ఉంది. జూలై 9 నాటికి కొత్త అధిక సుంకాల రేట్లను ఇతర దేశాలకు తెలియజేయనుంది. ఈ సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే, ఈ మూడు వారాలు ప్రభావిత దేశాలకు చర్చలు కొనసాగించడానికి గడువుగా ఉన్నాయి.
ఈ వార్తలతో పాటు గత వారం విడుదలైన బలమైన అమెరికా ఉద్యోగాల డేటా వలన ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలను తగ్గించింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సుంకాల ప్రభావం ఉంటుంది కాబట్టి, ఫెడ్ జూలైలో రేట్లు తగ్గించకుండా ఉండే అవకాశం ఉంది. మార్కెట్లు కూడా ఇప్పుడు సంవత్సరాంతానికి గరిష్ఠంగా రెండు తక్కువ వడ్డీ రేట్ల కోతలే ఉంటాయని భావిస్తున్నాయి.
ఇక భౌగోళిక రాజకీయాల్లో, ఖతార్‌లో జరిగిన హమాస్-ఇజ్రాయెల్ మధ్య పరోక్ష కాల్పుల విరమణ చర్చలు ఫలితమే లేకుండా ముగిశాయి. ఈ పరిణామాలతో బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై పెట్టుబడిదారులు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలు తగ్గినా.. కొనుగోలుకు ఇది మంచి సమయం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ధరలు ముందు ముందు మరింత తగ్గే అవకాశముంది కాబట్టి లాభాలను బుక్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు మాత్రం మరికొద్ది రోజుల వరకు వేచి ఉండాలని సలహా ఇస్తున్నారు.
జూలై 7 తేదీ సోమవారం బంగారం ధరలను పరిశీలిస్తే..భారతదేశంలో బంగారం ధర 100 గ్రాముల ధర రూ.32,800 తగ్గింది. 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.9,82,900 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.9,01,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.7,37,200 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,290 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,100 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.73,720 గా నమోదైంది. విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,290 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,100 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.73,720 గా నమోదైంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications