బంగారం ధర ఇక పెరిగే అవకాశమే లేదు..కీలక విషయాలను వెల్లడించిన బ్యాంకింగ్ రంగ నిపుణులు

2022 నుండి బంగారం ధరలు వేగంగా పెరుగతూ వస్తున్నాయి. ఇది పెట్టుబడిదారులకు లాభాల పంట పండిస్తోంది.దీనికి తోడు ప్రధానంగా కేంద్ర బ్యాంకుల భారీ బంగారాన్నికొనుగోలు చేశాయి. 2022లో ప్రపంచ కేంద్ర బ్యాంకులు 1,082 టన్నులు, 2023లో 1,037 టన్నులు, 2024లో 1,180 టన్నుల రికార్డు స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేశాయని నిపుణులు చెబుతున్నారు. ఈ స్థాయి కొనుగోళ్లు 2020-21 మధ్యకాలంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు

ఈ డిమాండ్ ధరలను గత ఏడాది నుంచి దూకుడుగా నడిపించింది. Gold జూలై 2022లో 1,730 డాలర్ నుంచి జూలై 2025 నాటికి 3,330 డాలర్ కి చేరింది. గత మూడు సంవత్సరాల్లో 90 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ పెరుగుదల వల్ల, బంగారం ఇప్పుడు కేంద్ర బ్యాంకుల ఫారెక్స్ నిల్వలలో 20 శాతం వాటాతో రెండవ అతిపెద్ద ఆస్తిగా మారింది (డాలర్ 46 శాతం తో మొదటి స్థానం).

gold demand central banks gold buying gold boom 2025 gold price trend is gold still a good investment global gold reserves gold investment outlook central bank gold reserves 2025 gold market slowdown future of gold market is gold demand declining gold buying by nations bullion demand 2025 gold market analysis precious metals trend 2025 2025 2025

ఇప్పుడు ఈ బంగారంపై కేంద్ర బ్యాంకుల డిమాండ్ తగ్గుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ బంగారు మండలి (WGC) ప్రకారం 2025 మొదటి రెండు త్రైమాసికాల్లో 410 టన్నుల బంగారం మాత్రమే కొనుగోలు చేశాయి ప్రధాన బ్యాంకులు. Q1లో 244 టన్నులు, Q2లో 166 టన్నులు కొనుగోలు చేశాయి ముఖ్యంగా పోలాండ్, టర్కీ, చైనా వంటి దేశాలు పసిడి కొనుగోళ్లలో ముందుండగా, కొనుగోళ్ల మొత్తం మాత్రం తగ్గుతోంది.

ప్రఖ్యాత విశ్లేష సంస్థ మెటల్స్ ఫోకస్ అంచనా ప్రకారం 2025 మొత్తం సంవత్సరానికి బంగారం కొనుగోళ్లు 8 శాతం తగ్గి.. 1,000 టన్నులకు చేరుతాయని భావిస్తున్నారు. మరికొంతమంది విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ సంఖ్య 1,000 టన్నుల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..కేంద్ర బ్యాంకులు తమ కొనుగోళ్లలో ఒక మూడవ వంతు మాత్రమే ప్రకటిస్తుంటాయి. మిగతా కొనుగోళ్లు రహస్యంగానే జరుగుతాయి. అంటే అసలైన డిమాండ్ పాక్షికంగా మాత్రమే ప్రజలకు తెలుస్తుంది.

ఇక బంగారం ధరలు జూలై 1 నుండి కొంత తగ్గుముఖం పట్టాయి. ఇది కేంద్ర బ్యాంకులకు తక్కువ ధరకు మరిన్ని కొనుగోళ్లకు అవకాశం ఇవ్వవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. WGC తాజా సర్వే ప్రకారం, 43 శాతం కేంద్ర బ్యాంకులు వచ్చే 12 నెలల్లో తమ బంగారు నిల్వలను పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి బంగారం ర్యాలీ తాత్కాలికంగా ఆగిపోయినట్లే కనిపిస్తోంది. ట్రంప్ సుంకాల ఆందోళనలు తగ్గుముఖం పడుతూ ఉండటంతో పాటు, డాలర్ బలపడుతోంది. మూడీస్ అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించినా.. ఇది నిలకడగా ఉన్న బంగారం ధరలను ప్రభావితం చేస్తోంది.

డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+