రాత్రికి రాత్రే కుప్పకూలిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతుందనే భయంతో ఎగబడి కొంటున్న సామాన్యులు
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..బంగారం ధరలు రాత్రికి రాత్రే ఢమాల్ అయ్యాయి. ఆగస్టు 22, శుక్రవారం నాడు ముంబయి, హైదరాబాద్, ఢిల్లీలో బంగారం ధరలు పడిపోయాయనే వార్త ఎక్కువగా వినిపించింది. సాధారణంగా పండగల సీజన్ దగ్గర పడుతుంటే బంగారం ధరలు ఎగబాకడం సహజం. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఒక్క రాత్రిలోనే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.10,100 కంటే తక్కువగా పడిపోవడం వినియోగదారులను ఆనందంలో ముంచెత్తింది.
ఇది కేవలం భారతదేశం మాత్రమే కాకుండా.. ప్రపంచ బంగారం మార్కెట్ మొత్తం ఒక దిశగా కదిలింది. అమెరికా డాలర్ బలపడడం, పెట్టుబడిదారుల సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి తగ్గడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్న అనిశ్చితి..ఈ అంశాలన్నీ బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3,328 డాలర్లకి పడిపోయింది. ఈ క్షీణతను చూసిన భారత వ్యాపారులు కూడా తమ రేట్లను వెంటనే తగ్గించారు.

భారతదేశంలో శుక్రవారం 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.10,053కి చేరింది. 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.9,215, 18 క్యారెట్ల బంగారం గ్రాము రూ.7,540కి తగ్గింది. నిన్న 10 గ్రాముల 24K గోల్డ్ రూ.1,00,750 ఉండగా.. ఈరోజు రూ.1,00,530గా మారింది. అంటే రూ.220 తగ్గింది. అలాగే 100 గ్రాముల 24K గోల్డ్ ధర రూ.10,07,500 నుంచి రూ.10,05,300కి పడిపోయింది. ఇక 22K గోల్డ్ 10 గ్రాముల ధర రూ.92,300 నుంచి రూ.92,150కి పడిపోయింది. దీంతో పాటుగా 18K గోల్డ్ 10 గ్రాములు రూ.75,520 నుంచి రూ.75,400కి తగ్గాయి.మరో లోహం వెండి కూడా అదే బాట పట్టింది. నిన్న గ్రాము రూ.116గా ఉన్న ధర ఈరోజు రూ.118కి పెరిగినా, కిలో ధర మాత్రం రూ.1,16,000 నుంచి రూ.1,18,000కి చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి
వే2వెల్త్ బ్రోకర్స్ రీసెర్చ్ ఎనలిస్ట్ అభిషేక్ ఎం.పెలు ఈ తగ్గుదలపై మాట్లాడుతూ.. గత కొన్ని సెషన్లలో MCX గోల్డ్ గణనీయమైన మార్పును చూసింది. అయితే 50 రోజుల EMA వద్ద బలమైన సపోర్ట్ లభిస్తోంది. ప్రస్తుతం ధరల దిశ తటస్థంగానే ఉంది. రూ.98,600 వద్ద తగ్గుదల నమోదు కాగా.. పెరుగుదల అంచనా రూ.99,600 వద్ద ఉందని వివరించారు.
నిర్మల్ బ్యాంగ్ సెక్యూరిటీస్ విశ్లేషకులు మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ ని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో మార్కెట్లో సెంట్రల్ బ్యాంక్ స్వాతంత్ర్యం పై ఆందోళనలు పెరిగాయి. దాంతో పసిడి డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. దీంతో ధరలు కొంత ఎగిసే అవకాశం ఉందని వారు తెలిపారు.
తాజాగా Gold ధరలు పతనం మధ్యతరగతి జీవులకు ఆనందాన్ని అందించింది. పండగల సీజన్ దగ్గరలో ఉండటంతో చాలా మంది ఈ అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని చార్‌మినార్ బంగారం బజార్‌లో షాపింగ్ చేస్తున్న గృహిణి సునీత మాట్లాడుతూ..ఇంతకాలం Gold ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో మేము వేచి చూశాం. ఇప్పుడు ఒక్క గ్రాముకైనా 200 రూపాయల తేడా రావడం అంటే 100 గ్రాములపై లక్ష రూపాయల వరకు ఆదా అవుతుంది. ఇది మాకు పెద్ద వరమని ఆనందంగా చెప్పారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications