Gold Loans: భారీగా పెరుగుతున్న బంగారం రుణాలు.. ఎందుకంటే..!

గత సంవత్సర కాలంలో బంగారం ధర భారీగా పెరిగింది. అయితే ఇదే సమయంలో బంగారంపై రుణాలు తీసుకోవడం కూడా భారీగా పెరిగింది. 2026 ఆర్థిక సంవత్సరంలో బంగారం రుణాలు దాదాపు 84 శాతం పెరిగాయి. బంగారం ధర పెరగడం వల్ల రుణం కూడా ఎక్కువ వస్తున్న తరుణంలో చాలా మంది బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటున్నారు. అంతే కాకుండా బ్యాంకులు బంగారం తనఖా పెట్టుకుని తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం కూడా బంగారం రుణాలు పెరగడానికి కారణమైందని ఓ నివేదిక పేర్కొంది. ఇండియాలో మహిళ్లల్లో దాదాపు అందరి వద్ద బంగారం ఉంటుంది. అది ఒక గ్రాము కావొచ్చు. ఒక కిలో కావొచ్చు.

కొందరికి వారసత్వంగా కూడా బంగారం వస్తుంటుంది. అందుకే దేశంలో మహిళల వద్ద బంగారం ఉంటుంది. అందుకే అత్యవసర సమయాల్లో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకుంటున్నారు. అంతే కాకుండా రుణం తీసుకోవడం చాలా సులభం. ఒక్క రోజులో బంగారం రుణం పొందవచ్చు. గత రెండు సంవత్సరాల్లో బంగారం రుణాల విలువ గణనీయంగా పెరిగింది. 2025 వార్షిక సంవత్సరంలో ఇది 69 ఉండగా.. 2026 వార్షిక సంవత్సరం నాటికి 84 శాతానికి పెరిగింది. బంగారంపై తీసుకున్న రుణాల విలువ 2023 మార్చిలో రూ.6.3 లక్షల కోట్లుగా ఉంటే.. అది 2026 మార్చి నాటికి రూ.19.4 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో ఒక రుణ ఖాతా సగటు రూ.98,000 నుంచి రూ.1.96 లక్షలకు పెరిగింది.

Gold Loan

అదే సమయంలో రుణాల చెల్లింపు జాప్యం తగ్గింది. 90 శాతానికి పైగా రుణాల చెల్లింపులో జాప్యం 2023లో మార్చిలో 0.4 శాతం ఉండగా.. 2026 మార్చి నాటికి అది 0.2 శాతానికి తగ్గింది. బంగారం రుణం సెక్యూర్డ్ లోన్ కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్కరు దాదాపు రుణం తిరిగి చెల్లిస్తారు. అంతేకాకుండా బ్యాంకులు బంగారం విలువలో 40 శాతం నుంచి 50 శాతం వరకే రుణాలు ఇస్తాయి. ఒకవేళ లోన్ కట్టకపోతే మిగతా డబ్బులు కోల్పోతామనే భయంతో రుణాలు తిరిగి చెల్లిస్తున్నారని తెలుస్తోంది. బంగారం రుణాలు ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో ఎక్కువగా తీసుకుంటున్నారు.

బంగారం రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 37 శాతం ఉండగా. అది 2024-25 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 45 శాతానికి తగ్గింది. అలాగే ఎన్‌బీఎఫ్‌సీల వాటా 33% నుంచి 44 శాతానికి పెరిగింది. బంగారం ధరల సూచీ 144 శాతం పెరగ్గా.. పసిడి రుణాల మంజూరు మొత్తాలు 200 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ లో ల బంగారం రుణాలు భారీగా పెరిగాయి. ఒక సంవత్సరంలోనే 138 శాతం పెరిగింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ 112 శాతం, రాజస్థాన్ 105 శాతం, మహారాష్ట్ర 102 శాతంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+