Gold Loan EMI: అత్యవసర సమయాల్లో ప్రజలు ఎక్కువగా గోల్డ్ లోన్ కోసం వెళుతుంటారు. పైగా ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేకుండా లోన్స్ పొందటం వీలుండటంతో ప్రజలు దీనిని ఎంపిక చేసుకుంటుంటారు. అయితే దేశంలో ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతున్న పసిడి రుణాలపై సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.
2024లో బంగారు రుణాల పెరుగుదల 17 శాతంగా ఉన్నాయి. ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్న ఒక వార్త ప్రకారం గోల్డ్ లోన్ ఈఎంఐలను చెల్లించని వ్యక్తుల బంగారు రుణాలను తిరిగి రెన్యూవల్ బ్యాంకులు అన్ని శాఖలను కోరినట్లు తెలుస్తోంది. అటువంటి గోల్డ్ లోన్ కస్టమర్ రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించమని, రుణాన్ని మూసివేయమని సకాలంలో రుణ చెల్లింపులు చేయని ఖాతాదారుల లోన్స్ రెన్యువల్ చేయవద్దని దేశంలోని చాలా బ్యాంకులు తమ శాఖలకు సూచించినట్లు సమాచారం. అయితే ఒకసారి లోన్ అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత కస్టమర్లు మళ్లీ కొత్త లోన్ తీసుకోవచ్చని తెలుస్తోంది.

ఒక వ్యక్తి గోల్డ్ లోన్ తీసుకుని కొన్ని కారణాల వల్ల అతను నెలవారీ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడం తరచుగా జరుగుతుంటాయి. అటువంటి పరిస్థితిలో కొంత సమయం తర్వాత రుణ మొత్తం పెరుగుతుంది. ఇది కస్టమర్‌పై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో బంగారం ధర కూడా కాలక్రమేణా పెరుగుతుంది. ఇటువంటి సమయంలో కస్టమర్లు తాము రుణం తీసుకున్న బ్రాంచ్ లో గోల్డ్ లోన్ రెన్యూవల్ చేసుకుంటారు. ఇది వారికి భారీ జరిమానాలు, వాయిదాల డిఫాల్ట్ నుంచి ఉపశమనం అందిస్తుంది. అయితే రుణాన్ని రెన్యూవల్ చేసుకునేందుకు ఎక్కువ వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా కస్టమర్ బంగారం విలువలో 75 శాతం వరకు గోల్డ్ లోన్ పొందుతారు.
బ్యాంకులు గోల్డ్ లోన్ విషయంలో నెలవారీ లోన్ ఈఎంఐ చెల్లింపు పద్ధతితో పాటు ఏకకాలంలో రుణాన్ని పొంది గడువు చివరిలో అసలు, వడ్డీ మెుత్తాన్ని కలిపి చెల్లించేందుకు వెసులుబాటును కలిగి ఉంటాయి. ప్రస్తుత ఆర్బీఐ చర్యలు గోల్డ్ లోన్స్ విషయంలో దీర్ఘకాలిక నష్టాలను తగ్గించడానికి రిస్క్ మేనేజ్‌మెంట్‌ను బలోపేతం చేయడానికి రుణదాతలపై నిరంతరం ఒత్తిడి తెస్తోంది. ఈ చర్యలు సమీప భవిష్యత్తులో రుణదాతల వ్యాపారంలో అస్థిరతను పెంచుతాయని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అభిప్రాయపడింది. బంగారంపై నగదు రుణాలు తీసుకోవడానికి ఆర్‌బీఐ విధించిన పరిమితి వల్ల కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంకు ఖాతాల నుంచి రుణాలు ఇవ్వాల్సి వస్తుందని, ఇది కొత్త రుణాల రేటును మందగించవచ్చని ఫిచ్ తెలిపింది. డబ్బు రూపంలో రుణాలు పొందాలనుకునేవారు ఇప్పటికే అనధికారిక రంగానికి షిఫ్ట్ అవుతున్నారని ఫిడ్ పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications