Gold Loans: భారీగా పెరుగుతున్న బంగారం రుణాలు.. పసిడి ధర ఇంకా పెరుగుతుందా..!
బంగారం ధర భారీగా పెరుగుతోంది. గత సంవత్సరం కాలంగా పసిడి ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. జూన్ లో కాస్త తగ్గినట్లు అనిపించిన పుత్తడి ధర ఆగస్ట్ లో భారీగా పెరుగుతోంది. అయితే ఈ ఏడాది జనవరిలో బంగారం ధర భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,70,000 లకు పైగా పెరిగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. దాదాపు రూ.1,42,000 చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,63,970గా ఉంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం రూ.1,50,300కి చేరింది.
బంగారం ధర భారీగా పెరగడం వల్ల బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. సాధారణంగా బ్యాంకులు, పలు ఎన్భీఎఫ్సీలు బంగారం విలువలో దాదాపు 50 శాతం నుంచి 70 శాతం వరకు రుణాలు ఇస్తాయి. కొన్ని బ్యాంకులు 85 శాతం వరకు రుణాలు ఇస్తాయి. రెండేళ్ల క్రితం బంగారం ధర 22 తులానికి రూ.60 వేల నుంచి 70 వేల మధ్య ఉంది. అప్పుడు పసిడి తాకట్టు పెడితే రూ.30 నుంచి రూ.40 వేలు వచ్చేవి. కానీ ఇప్పుడు బంగారం ధర పెరగడంతో లోన్లు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి రూ.70 నుంచి రూ.80 వేల వరకు గోల్డ్ లోన్ వస్తుంది. అందుకే బంగారం తాకట్టు పెరుగుతోంది. పైగా వడ్డీ కూడా తక్కువ ఉండడంతో గోల్డ్ లోన్స్ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి తమ పసిడి రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 1.5 లక్షల కోట్లను అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ఎండీ బినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది రూ. 1.25 లక్షల కోట్లుగా ఉన్నట్లు తలిపారు. పసిడి రుణాల సెగ్మెంట్ 20 శాతం మేర పెరగవచ్చని భావిస్తున్నట్లు వివరించారు. మరోవైపు మొత్తం రుణాల్లో ఆర్‌ఏఎం (రిటైల్, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ) వాటా 65 శాతంగా ఉండగా, మిగతా 35 శాతం వాటా కార్పొరేట్ రంగానిది ఉంటుందని గుర్తు చేశారు. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈల దన్నుతో ఆర్‌ఏఎం విభాగ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయి పేర్కొన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కాసా 15.30 శాతం వృద్ధి చెందినట్లు వివరించారు. సేవింగ్స్ డిపాజిట్లు 13.54 శాతం, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 26.33 శాతం పెరిగినట్లు తెలిపారు. కాగా బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం రుణాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయుల ఇళ్లలో టన్నుల కొద్ది పసిడి ఉన్న నేపథ్యంలో గోల్డ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications