బంగారం కొనేందుకు ఎగబడుతున్న జెన్ జడ్.. జీతం పడిన వెంటనే పసిడి షాపుకు పరుగులు..

భారతదేశంలో జెన్ జడ్ ట్రెండ్ మారుతోంది. ఇప్పటిదాకా ఈ తరం ఎంజాయ్ మెంట్ తప్ప సేవింగ్స్ గురించి ఆలోచించేవారు కాదు. అయితే యువతరం ఇప్పుడు మేల్కొంది. సేవింగ్ ఆలోచనలు మొదలు పెట్టారు. అయితే ఈ సేవింగ్ ఎలా చేస్తున్నారంటే కొన్ని ఆసక్తిక అంశాలు బయటకు వచ్చాయి. ఈ తరమంతా పెట్టుబడిని బంగారం మీద పెడుతున్నారు. స్టాక్ మార్కెట్, మ్యూచ్ వల్ ఫండ్స్ ని వదిలేసి పసిడి మీద పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

స్మిట్టెన్ పల్స్ఏఐ నిర్వహించిన సర్వే ప్రకారం.. 18 నుంచి 39 ఏళ్ల వయస్సు గల 5 వేల మంది యువకులలో.. Gold కొనుగోలు ఇప్పుడు వ్యక్తిగత, చిన్న పరిమాణంలో మారుతున్నది. సాంప్రదాయ, కుటుంబ-కేంద్రిత కొనుగోళ్ల స్థానంలో Gen Z, మిలీనియల్స్ తమ వ్యక్తిగత మైలురాళ్ళు, మొదటి జీతాలు, వ్యక్తిగత అవసరాల కోసం బంగారం కొనుగోలు చేస్తున్నారు.

gold investment bullion investment Gen Z gold buyers millennials gold trends gold under 5 grams small gold coins gold ETFs vs bullion young investor trends gold market India gold buying habits gold preference stocks vs gold mutual funds vs bullion gold investment trends youth gold demand Gen Z Millennials 5 vs vs MF vs

సురక్షిత పెట్టుబడిగా Gold ఇప్పటికీ మొదటి ఎంపిక. రూ. 25 వేల పెట్టుబడి కోసం, సర్వేలో 61.9 శాతం మంది బంగారాన్ని ఎంచుకున్నారు. ఇది మ్యూచువల్ ఫండ్స్ (16.6%), ఫిక్స్‌డ్ డిపాజిట్లు (13%), స్టాక్ మార్కెట్ (6.6%), క్రిప్టో (1.9%) కంటే చాలా ముందుంది. ఆర్థిక అస్థిరత సమయంలో కూడా యువత బంగారంపై నమ్మకం కొనసాగిస్తోంది; 65.7 శాతం మంది బంగారం స్టాక్, MF, బ్యాంకు పొదుపుల కంటే బంగారం సురక్షితంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

అయితే కుటుంబ ప్రభావం తగ్గి, వ్యక్తిగత నిర్ణయాలు పెరుగుతున్నాయి. 66.7 శాతం మంది బంగారం కొనుగోళ్లు వ్యక్తిగత, స్వీయ-ప్రేరేపిత నిర్ణయాలుగా మారాయని పేర్కొన్నారు. 42.3 శాతం మంది ఇటీవల ఇంట్లోనే బంగారం కొనుగోలు ప్రారంభించగా.. 40 శాతం మంది తల్లిదండ్రుల ప్రభావం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. Gen Z తమ బంగారం కొనుగోలు విధానంలో స్వతంత్రత చూపుతున్నా, మిలీనియల్స్ ఇప్పటికీ కుటుంబ నియంత్రణ, దీర్ఘకాలిక భద్రత పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కొనుగోలు పరిమాణాలు చిన్నవిగా మారాయి. 61.9 శాతం మంది 5 గ్రాముల కంటే తక్కువ బంగారం, 27.5 శాతం మంది 2 గ్రాముల కంటే తక్కువ, 34.4 శాతం మంది 2-5 గ్రాముల మధ్య కొనుగోలు చేశారు. 42 శాతం కుటుంబాలు ఇప్పుడు క్రమానుగతంగా చిన్న బంగారం కొనుగోలు చేస్తాయి. 58 శాతం ఒకేసారి సందర్భోచితంగా కొనుగోలు చేస్తున్నారు.

ముందు బంగారం కొనుగోళ్లు ఎక్కువగా పెళ్లిళ్లకు పరిమితం అయినా.. ఇప్పుడు వ్యక్తిగత పెట్టుబడి, మొదటి జీతం, వ్యక్తిగత milestones కోసం కొనుగోలు పెరుగుతోంది. 24.3 శాతం మంది మొదటి జీతం తర్వాత మొదటిసారి బంగారం కొనుగొన్నారు. 23.9 శాతం మంది పెట్టుబడిగా ఎంపిక చేశారు. Gen Z చిన్న, వ్యక్తిగత milestones కోసం కొనుగోలు చేస్తూ, మిలీనియల్స్ దీర్ఘకాలిక భద్రత, కుటుంబ ఉద్దేశ్యంతో కొనుగోలు కొనసాగిస్తున్నారు.

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు పెరుగుతున్నా.. సాంప్రదాయ ఛానెల్స్ దే ఆధిక్యం. 38.3 శాతం మంది పెద్ద బ్రాండెడ్ జువెలరీ నుంచి.. 34.7 శాతం మంది స్థానిక వ్యాపారుల నుంచి బంగారం కొనుగోలు చేస్తున్నారు, 5.2 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ప్రధాన ఆందోళనలు ప్రామాణికత (49.4%), దాచిన ఛార్జీలు (21%), పునర్విక్రయ విలువ (17%)పై ఉన్నాయి.

కోణుగోలు తర్వాత గందరగోళం కూడా ఉంది. 67.1% మంది కొన్నిసార్లు లేదా తరచుగా కొనుగోలు తర్వాత చింతిస్తున్నారు. 38.9% ధరపై, 33.5% ఫార్మాట్ పై, 18.8% సమాచారం తగినంత లేకపోవడం కారణంగా. భవిష్యత్తులో బంగారం కొనాలనే ఉద్దేశం బలంగా ఉంది. 52.7% మంది రాబోయే 12-24 నెలల్లో బంగారం కొనుగోలుకు "చాలా ఎక్కువ అవకాశం" ఉందని చెప్పారు.

మొత్తంగా చూసుకున్నట్లయితే Gen Z, మిలీనియల్స్ మధ్య చిన్న, వ్యక్తిగత బంగారం కొనుగోలు పెరుగుతోంది. సాంప్రదాయ మార్గాలపై నమ్మకం ఇంకా ఉంది, భవిష్యత్తులో బంగారం యువతలో సురక్షిత, విశ్వసనీయ పెట్టుబడిగా కొనసాగుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+