Gold Investment Risk: బంగారం ధరలు నింగిని తాకుతున్న సమయంలో పసిడిపై పెట్టుబడులు అంత సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారంలో ఈ సమయంలో పెట్టుబడులు అంత మంచివి కాదని అనేక సమస్యల్లో ఇరుక్కుంటారని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా వార్నింగ్ ఇస్తున్నారు. లింక్‌డిన్‌లో దీనిపై ఆయన ఓ కథనం పోస్ట్ చేశారు. పసిడి ధరలు మాత్రమే కాకుండా మార్కెట్‌లో ఉన్న అనేక సమస్యలు పెట్టుబడిదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని కాబట్టి ఇప్పుడున్న సమయంలో పసిడి కొనడం అంత సురక్షితం కాదని చెబుతున్నారు.
ప్రస్తుతం బంగారం కొనడం చాలా ప్రమాదకరమని నా భావన. ఇది కేవలం అధిక ధరల సమస్య మాత్రమే కాకుండా మరిన్ని సమస్యలకు కారణం అవుతుంది.గత నెలలో బంగారు నగల విక్రయాలు 60 శాతం కంటే ఎక్కువ తగ్గాయి. ఇది గత ఐదేళ్లలోనే అతిపెద్ద పతనమని చెప్పుకొచ్చారు. బంగారం షాపు యజమానులు మేకింగ్ ఛార్జీలపై డిస్కౌంట్లు ఇస్తున్నా బంగారంపై డిమాండ్ ఇప్పుడు బలహీనంగానే ఉందని చెప్పుకొచ్చారు ఆహుజా. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర దాదాపు లక్ష రూపాయలకు దగ్గరగా చేరుకుంది. ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకోవడంతో బంగారం షాపు యజమానులు కూడా పసిడి ఉత్పత్తిని సగానికి పైగా తగ్గించారని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో బంగారం అమ్మడం కూడా లాభదాయకం కాదని అహుజా హెచ్చరించారు.ప్రస్తుతం మీరు మీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మాలనుకుంటే..వాళ్లు మార్కెట్ రేటుకన్నా తక్కువ ధరే ఆఫర్ చేస్తారు.ఎందుకంటే అమ్ముడుపోని స్టాక్ అధికంగా ఉండడం ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు.జ్యువెలర్లు ఇప్పుడు 14 క్యారెట్ల బంగారంపై దృష్టి పెడుతున్నారు. కొందరు 9 క్యారెట్ల నగలకూ హాల్‌మార్క్ అనుమతించేందుకు BISను లాబీ చేస్తున్నారు. దీని ద్వారా కస్టమర్లకు నగలు కొంత చౌకగా లభిస్తున్నాయని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే బంగారంతో వెండి పోటీ పడుతుంది.కిలో వెండి ధర ఏకంగా లక్షకు పైగానే ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ నుంచి డిమాండ్ పెరగడం వల్ల వెండి ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముందని అహుజా అంచనా వేస్తున్నారు. ఇక పసిడి రేటు ఎక్కువ కావడంతో గోల్డ్‌ప్లేటెడ్ లేదా ఇమిటేషన్ జ్యువెలరీకి ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. డైరెక్ట్ టు కన్స్యూమర్ (D2C) బ్రాండ్లు విభిన్న డిజైన్లతో మార్కెట్‌లో చెలామణి అవుతున్నాయని వ్యాఖ్యానించారు.
చివరగా ఆయన ఏమంటున్నారంటే.. బంగారం మీద పెట్టుబడులు ఇప్పుడు చాలా రిస్క్‌గా మారుతున్నాయి. డిమాండ్ తగ్గడం, అధిక ధరలు, అమ్మకంలో నష్టాలు పసిడి పెట్టుబడిదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమయంలో వెండి లేదా కృత్రిమ నగలు మంచి ఎంపికలుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications