Gold News: శిఖరాన్ని తాకిన గోల్డ్ రేటు.. ఆగస్టులో అసలు జరిగింది ఇదే, షాపింగ్ పరిస్థితి..?
Gold Imports: భారతదేశంలో పసిడి సామాన్యుల నుంచి ధనవంతుల వరకు షాక్‌కి గురిచేస్తోంది. గడచిన 15 రోజుల నుంచి గోల్డ్ రేట్లు ఎవరెస్ట్ శిఖరాన్ని తాకాయి. వాస్తవానికి ఫెడ్ వడ్డీ రేట్ల తర్వాత పసిడి ధరల్లో ర్యాలీ అందరి ఊహలకు మించిపోయింది. అయితే రేట్ల మెగా ర్యాలీకి దారితీసిన అంశాల గురించి ఇప్పుడు అందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే మరోపక్క వ్యాపారులు మాత్రం పసిడి పెరుగుదలను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.
కొన్ని వారాల కింద భారత ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ బంగారం దిగుమతిపై ఉన్న సుంకాన్ని 15 శాతం నుంచి భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయ బంగారం డిమాండ్ బలంగా కొనసాగింది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉన్న ఇండియాలో ఉత్సాహభరితమైన పండుగ, వివాహ సీజన్ డ్రైవ్ కొనుగోళ్లకు అవకాశం కల్పించనుందని పసిడి విక్రయదారులు అంచనా వేశారు. ఈ క్రమంలో భారీగా పసిడి దిగుమతులు కొనసాగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా వెల్లడించింది.

దిగుమతి సుంకం తగ్గింపుతో ఆగస్ట్‌లో పసిడి దిగుమతులు 3 రెట్లు పెరిగి 140 టన్నులకు చేరుకున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ ఏడాది పుష్కలంగా రుతుపవనాలు పంట అవకాశాలను ప్రకాశవంతం చేసినందున గ్రామీణ డిమాండ్ సానుకూల ధోరణి కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు, నిపుణులు భావించిన నేపథ్యంలో గోల్డ్ దిగుమతులు భారీగా పెరిగాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లోకి ప్రవేశించినందున ఆభరణాల కొనుగోలు రెండు వారాల్లో పుంజుకుంటాయని తెలుస్తోంది. నవంబరులో దసరా, దీపావళి- డిసెంబర్ జనవరిలో వివాహాల బిజీ ఉన్నందున డిమాండ్ అందిపుచ్చుకునేందుకు నగల వ్యాపారాలు సైతం భారీగా పసిడి కొనుగోళ్లను చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వ ప్రో గోల్డ్ పాలసీ చర్యల కారణంగా గత ఏడాదితో పోలిస్తే 2024 ద్వితీయార్థంలో బంగారం డిమాండ్ 50 టన్నుల కంటే ఎక్కువగా పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ అన్నారు. ఈ ఏడాది మొత్తం దేశీయ పసిడి డిమాండ్ 750-850 టన్నుల మధ్య ఉండవచ్చని ఆయన అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పసిడి అతిపెద్ద కొనుగోలుదారుగా ఉన్న చైనాలో ఆభరణాల కొనుగోళ్లు తగ్గిపోయాయి.
భారతదేశంలో తక్కువ ఖర్చులు ఉండటంతో చాలా మంది ప్రైస్ సెన్సిటివ్ కొనుగోలుదారులు ఇప్పుడు భారీ ఆభరణాలను ఎంచుకుంటున్నారు. కొనుగోలుదారులు సైతం చౌకైన తేలికైన వస్తువులకు దీర్ఘకాలిక ప్రాధాన్యతనిస్తున్నారు. అకస్మాత్తుగా ప్రభుత్వ నిర్ణయం కారణంగా గోల్డ్ రేట్లు 9 శాతం మేర తగ్గటంతో చాలా మంది కొనుగోలుకు సరైన సమయంగా భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications