బంగారం దిగుమతులు 22% జంప్, ఐనా వాణిజ్య లోటు తగ్గుదల
దేశీయ కరెంట్ అకౌంట్ లోటు(CAD)పై ప్రభావం చూపే బంగారం దిగుమతులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 22.58 శాతం ఎగిసి 34.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మన దేశ కరెన్సీలో ఇది రూ.2.54 లక్షల కోట్లు. కరోనా లాక్ డౌన్ అనంతరం దేశీయంగా డిమాండ్ పెరగడంతో దిగుమతులు పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక వెండి దిగుమతులు 71 శాతం తగ్గి 791 మిలియన్ డాలర్లుగా నమోదయింది.

కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి
బంగారం దిగుమతులు పెరిగినప్పటికీ 2019-20లో 161.3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 2020-21లో 98.56 బిలియన్ డాలర్లకు తగ్గింది. వచ్చే అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దిగుమతులు మరింత పెరిగి కరెంట్ ఖాతా లోటుపై ఇంకా ఒత్తిడి పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. వెండి దిగుమతులు 2019-20లో 28.23 బిలియన్ డాలర్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం 791 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి.

ప్రతి ఏటా బియ్యం దిగుమతులు
ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశం భారత్. ముఖ్యంగా ఆభరణాల పరిశ్రమలు ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి. గత ఆర్థిక సంవత్సరం జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు 27.5 శాతం తగ్గి 26 బిలియన్ డాలర్లు నమోదయింది. భారత్ ప్రతి సంవత్సరం 800 నుండి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. బంగారం దిగుమతులపై ఉన్న సుంకాన్ని గత బడ్జెట్లో కేంద్రం 12.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.

జీడీపీలో 0.2 శాతం
డిసెంబర్ త్రైమాసికంలో భారత్ కరెంట్ ఖాతా మొదటిసారి లోటుకు చేరుకుంది. అంతరం 1.7 బిలియన్ డాలర్లు లేదా జీడీపీలో 0.2 శాతం. కరోనా అనంతరం భారీగా పెరిగిన బంగారం ధరలు ఆ తర్వాత గత నెలలో ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.12000కు పైగా తగ్గిన విషయం తెలిసిందే. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ధరలు తిరిగి పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications