2019-20 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో 27 బిలియన్ డాలర్ల (రూ.1.90 లక్షల కోట్ల) విలువైన పసిడి దిగుమతి అయింది.

బంగారం ఎఫెక్ట్.. తగ్గిన వాణిజ్య లోటు
అంతకుముందు ఏడాది ఇదే సమయంలో వచ్చిన 29.62 బిలియన్ డాలర్లతో పోలిస్తే 8.86% తగ్గింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్యలోటు 173 బిలియన్ డాలర్ల నుంచి 143.12 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు చెప్పింది.

ఇన్వెస్టర్లు ఆచితూచి
బంగారం ధర రికార్డ్ స్థాయిలో పుంజుకుంటుండటం, కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో గత ఏడాది డిసెంబర్ నుంచి పసిడి దిగుమతుల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకుంటోంది. దేశీయంగా ఆభరణాలకు అధికంగా డిమాండ్ ఉండటంతో భారత్ ప్రతి సంవత్సరం 800 నుంచి 900 టన్నులకు వరకు బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.

CADను కట్టడి చేసేందుకు..
వాణిజ్య లోటు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌ను (CAD) కట్టడి చేయడంలో భాగంగా కేంద్రం పసిడి దిగుమతులపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని 10 శాతం నుండి 12.5 శాతానికి పెంచింది. దీంతో ఈ రంగంలో ప్రతికూలత నమోదయింది. మరోవైపు జెమ్స్ అండ్ ఆభరణాల వర్తకులు ఈ సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications