బంగారం మీద పెట్టుబడులపై బ్యాకింగ్ రంగ నిపుణులు కీలక సూచన.. ధరలు పెరిగినప్పుడు ఆచితూచి..
ఈ ఏడాది బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగి.. ఇంతకు ముందెప్పుడూ అందని స్థాయిని తాకాయి. ఈ ర్యాలీకి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) వడ్డీ రేటులు తగ్గించనున్న అంచనాలు. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధర పెరుగుతుంది.. కారణం ఏంటంటే ఇది బంగారాన్ని ఆకర్షణీయ పెట్టుబడిగా మారుస్తుంది. బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల భారతదేశంలో జ్యువెలరీ కంపెనీల షేర్లు మాత్రం అంతగా మెరవడంలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు జ్యువెలరీ స్టాక్‌లు సుమారు 35 శాతం వరకు పడిపోయాయి.
సాధారణంగా పండుగ సీజన్ సమీపంలో ఆభరణాల డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. వివాహాలు, ఉత్సవాల సమయంలో భారీగా ఆభరణాలు కొనుగోలు చేయడం మన సంప్రదాయంగా ఉంటుంది. అయితే ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. పండుగల సమయాల్లో ఆభరణాల అమ్మకాలు సాధారణంగా సంవత్సరానికి 30-35 శాతం వాటా ఉంటుంది. అయితే ఈ సారి Gold పెరుగుదలతో భారీగా పడిపోయింది.

ఇప్పుడు వినియోగదారులు ఎక్కువగా తేలికైన డిజైన్లు, వెండి, 18K ఆభరణాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. పెద్ద సంస్థలు తక్కువ ధరల ఆభరణాల వ్యాపారంతో తట్టుకుంటున్నా, చిన్న వ్యాపారులు మాత్రం ఇంకా నష్టాల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. బంగారం ధరలు ఎక్కువగా పెరుగుతున్నప్పుడు ఆభరణాల కంపెనీల షేర్లు బలంగా దూసుకుపోవు. కానీ ధరలు స్థిరంగా ఉంటే ఆ షేర్లను కొనవచ్చు. పెట్టుబడిదారులు చిన్న కంపెనీల కంటే టైటాన్ వంటి పెద్ద, స్థిరపడిన కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. ముత్తూట్ ఫైనాన్స్ వంటి బంగారు ఫైనాన్స్ కంపెనీలకు ఎక్కువ లాభ అవకాశం ఉంది. ఎందుకంటే అధిక బంగారం ధరల వలన నేరుగా అవి ప్రయోజనం పొందుతాయని చెబుతున్నారు.
ఇక బంగారం కంపెనీలు స్టాక్ మార్కెట్లో ప్రభావం ఎలా ఉందంటే.. టైటాన్ కంపెనీ ఈ సంవత్సరం 12 శాతం వరకు స్టాక్ పెరిగింది. ఇక తంగమయిల్, గోల్డియం ఇంటర్నేషనల్ షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి. ఇక కళ్యాణ్ జ్యువెలర్స్, PC జ్యువెలర్స్, PN గాడ్గిల్ షేర్లు ఈ సంవత్సరం 20-35 శాతం వరకూ పడిపోయాయి.
క్లుప్తంగా చెప్పాలంటే ఆభరణాల రంగంలో పండుగ సీజన్ సరైన అవకాశంగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ, బంగారం ధరలు ఎక్కువగా ఉన్నపుడు కొంత మితమైన డిమాండ్ మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయనేది నిపుణులు విశ్లేషణ. అందువల్ల పెట్టుబడిదారులు వాటా ఎక్కువ ఉన్న బంగారు బ్రాండ్ల షేర్లలో ధైర్యంగా పెట్టుబడి పెట్టడం మంచిది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications