భారతదేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులు ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉన్నాయి. గత నెలలో ఓ మాదిరిగా పెరిగిన బంగారం ధరలు ఈ నెలలో రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోయాయి. అక్టోబర్ మొదటి వారం నుంచే బంగారం ధరలు పెరిగి పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ప్రియుల పాలిట శాపంగా మారుతున్నాయి. డ్రాగన్ కంట్రీ చైనా మీద విధించిన 100 శాతం సుంకాలు పెట్టుబడిదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లంతా డాలర్ ను వదిలేసి సురక్షిత ఆస్తిగా పరిగణించబడుతున్న బంగారం మీదకు తమ పెట్టుబడులను మళ్లించారు. చైనా వస్తువులపై ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించడంతో పాటు, సాంకేతిక ఉత్పత్తులపై ఎగుమతి పరిమితులు విధించడం గ్లోబల్ ఆర్థిక అనిశ్చితిని మరింతగా పెంచింది.
మంగళవారం MCX డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు రూ. 3,000 కంటే ఎక్కువ పెరిగి 10 గ్రాములకు రూ. 1,28, 350 చేరాయి.ఇదే సమయంలో, MCX డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు రూ.7,400 పెరిగి కిలోకు రూ.1,62,057 గరిష్టాన్ని తాకాయి. ఈ పెరుగుదల ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల రక్షణాత్మక దృక్పథం కారణంగా వచ్చింది. చైనా తన అరుదైన భూమి (rare earth) ఎగుమతులపై పరిమితులు విధించడానికి సిద్ధపడుతుండగా.. అమెరికా ప్రభుత్వం చైనా నుండి వచ్చే కొన్ని కీలక ఉత్పత్తులపై 100 శాతం సుంకం విధించింది. ఈ చర్య ప్రపంచ వాణిజ్య సప్లై చెయిన్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం బంగారం ధరలను పరిశీలిస్తే.. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు గ్రాము బంగారం ధర రూ. 295 పెరిగి 12, 836 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 270 పెరిగి రూ.11, 765 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల బంగారం ధర రూ.221 పెరిగి 9,626 వద్ద ట్రేడ్ అవుతోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గత 24 గంటల్లో రూ. 6,230 పెరిగిందని చెప్పవచ్చు.
LKP సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ ఉపాధ్యక్షుడు జతీన్ త్రివేది మాట్లాడుతూ..యుఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తిరిగి సురక్షిత పెట్టుబడులపై ఆసక్తిని పెంచాయి. దీని ఫలితంగా బంగారం ధరలు బలమైన గ్యాప్‌తో రూ. 1,28,350 దాటాయి. భవిష్యత్తులో కూడా ఈ బుల్లిష్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని అన్నారు. ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ మాట్లాడుతూ, దీపావళి ముందు బులియన్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చు. భారతదేశంలో పండుగ కొనుగోళ్లు, ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా స్వల్పకాలిక దిద్దుబాట్లు ఉన్నప్పటికీ, మొత్తం ధోరణి బంగారానికి అనుకూలంగా ఉందని తెలిపారు.
మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి ప్రకారం.. Gold వరుసగా ఎనిమిదో వారం లాభాలు నమోదు చేసింది. పెట్టుబడిదారులు రికార్డు స్థాయిల వద్ద జాగ్రత్తగా ఉన్నప్పటికీ, బుల్లిష్ ఊపు కొనసాగుతుందని కనిపిస్తోంది. డాలర్ బలహీనత, వడ్డీ రేటు కోతల అంచనాలు కూడా బంగారానికి మద్దతు ఇస్తాయి. కలాంత్రి అంచనా ప్రకారం USDలో బంగారం మద్దతు స్థాయి 3,965 డాలర్ల నుంచి 3,930 డాలర్ల వద్ద ఉండగా, నిరోధం 4,050 డాలర్ల నుంచి 4,075 డాలర్ల వద్ద ఉంది. భారత కరెన్సీలో చెప్పాలంటే బంగారం మద్దతు రూ. 1,20,670 నుంచి రూ. 1,19,980 వద్ద ఉండగా కొనుగోలు చేయాలని చెబుతున్నారు. అలాగే రూ. 1,22,450 నుంచి రూ. 1,22,950 మధ్య ఉన్నప్పుడు కొనుగోలు బంద్ చేయాలని చెబుతున్నారు.
మార్కెట్ నిపుణులు ప్రకారం.. Gold ధరలు దీపావళి వరకు బలంగా కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారత పండుగ సీజన్‌లో డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ అస్థిరతలు,ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతల అంచనాలు బంగారానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, ద్రవ్యోల్బణ భయాలు, సురక్షిత పెట్టుబడి డిమాండ్ కారణంగా బంగారం ధరలు సమీప భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయిల్లో కొనసాగే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు స్వల్పకాలిక దిద్దుబాట్లను సద్వినియోగం చేసుకుంటే, దీర్ఘకాలంలో బంగారం లాభదాయక ఆస్తిగా నిలవవచ్చని నిపుణుల సూచన.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications