అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ భయం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతల అంచనాలు అన్నీ కలిసి బంగారం ధరను మళ్లీ చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేర్చాయి. సోమవారం ఉదయం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సుకు ధర తొలిసారిగా 3,900 డాలర్లు దాటింది. ఇది పెట్టుబడిదారుల మధ్య భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది.
0027 GMT నాటికి స్పాట్ గోల్డ్ ధర 0.4 శాతం పెరిగి 3,900.40 డాలర్ల వద్ద నిలిచింది. అంతకు ముందు సెషన్‌లో బంగారం 3,919.59 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. డిసెంబర్ డెలివరీ కోసం అమెరికా Gold ఫ్యూచర్స్ కూడా 0.5 శాతం పెరిగి 3,926.80 డాలర్లకి చేరుకుంది. ఈ పెరుగుదల బంగారం మార్కెట్‌లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింతగా రెట్టింపు చేసింది.అమెరికాలో ప్రభుత్వ పాక్షిక మూసివేత (షట్‌డౌన్) అవకాశం పెరుగుతుండడంతో పెట్టుబడిదారులు తమ డబ్బును సురక్షితమైన ఆస్తుల్లో నిల్వ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్ డెమోక్రాట్లతో ఒప్పందం సాధ్యమయ్యే అవకాశాలు తక్కువని ప్రకటించడంతో పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారింది. వైట్ హౌస్ సీనియర్ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ స్థితి ఇలాగే కొనసాగితే వేలాది ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ రాజకీయ అనిశ్చితి మార్కెట్లలో భయాన్ని పెంచడంతో పెట్టుబడిదారులు సాంప్రదాయ సురక్షిత ఆశ్రయం అయిన బంగారంపై దృష్టి పెట్టారు.
ఇక ఆర్థిక రంగంలో మరో ముఖ్య అంశం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు నిర్ణయం. ఫెడ్ గవర్నర్ స్టీఫెన్ మిరాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో ట్రంప్ పరిపాలన విధానాల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలంగా ఉందని, అందుకే ఫెడ్ దూకుడుగా రేటు కోతలు చేయాలని సూచించారు. CME ఫెడ్‌వాచ్ టూల్ ప్రకారం పెట్టుబడిదారులు అక్టోబర్, డిసెంబర్ సమావేశాల్లో వరుసగా 25 బేసిస్ పాయింట్ల చొప్పున కోతలు ఉంటాయని 95 శాతం, 83 శాతం అవకాశాలను గణిస్తున్నారు. తక్కువ వడ్డీ రేట్లు సాధారణంగా దిగుబడి లేని బంగారానికి అనుకూలం. ఎందుకంటే అది అప్పు వ్యయం తగ్గించడంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మరింత ఆకర్షితులయ్యేలా చేస్తుంది.
2024లో బంగారం ధర దాదాపు 49 శాతం పెరిగింది. దీనికి ప్రధాన కారణాలు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు, Gold ఆధారిత ETFల డిమాండ్ పెరగడం, బలహీనమైన డాలర్, అలాగే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. పెట్టుబడిదారులు ఈ పరిస్థితుల్లో తమ సొమ్మును రక్షించుకునే ప్రయత్నంలో బంగారాన్ని ఒక హెడ్జ్‌గా చూస్తున్నారు.
భారతదేశంలో కూడా ఈ పరిస్థితి ప్రత్యేకంగా కనిపిస్తోంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారైన భారత్‌లో ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, ఇటీవల భౌతిక బంగారం డిమాండ్ పెరిగింది. దీపావళి పండుగ సమీపిస్తుండడంతో వినియోగదారులు మళ్లీ నగల కొనుగోళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు చైనా మార్కెట్లు సెలవుల కారణంగా మూసివేశారు.ఇక ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ETF అయిన SPDR గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ స్వల్పంగా తగ్గి 1,014.88 టన్నులుగా నమోదయ్యాయి.
ఇతర విలువైన లోహాలు కూడా స్వల్ప మార్పులను చూపాయి. వెండి ఔన్సుకు 47.98 డాలర్ల వద్ద స్థిరంగా ఉండగా, ప్లాటినం 1,613.15 డాలర్లు, పల్లాడియం 1,263 డాలర్లకి పెరిగాయి. ఏదేమైనా ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మళ్లీ బంగారానికి కొత్త మెరుపు తెచ్చాయి.ప్రస్తుత ధోరణి చూస్తుంటే, నిపుణుల అంచనాల ప్రకారం 4,000 డాలర్ల మార్క్ కూడా దూరంలో లేదనిపిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..



Click it and Unblock the Notifications